పంజాబ్ ప్రభుత్వం నిన్నటి నుంచి అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం బోగస్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది.
తమ ప్రభుత్వం ఢిల్లీలో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్ ప్రయాణ పథకానికి ఇది కాపీ అని అంటూ కనీసం కాపీకొట్టడం కూడాపూర్తిగా లేదని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యానించించి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మనస్ఫూర్తిగా ఈ పథకం అమలు చేయాలేదని పంజాబ్ ఆప్ నేత రాఘవ్ చాధా వ్యాఖ్యానించారు.
ఢిల్లీ ఈపథకాన్ని ప్రయివేటు, ప్రభుత్వ బస్ లన్నింటిలో అమలు చేస్తున్న విషయం చెబుతూ పంజాబ్ లో ఉచిత ప్రయాణం కేవలం ప్రభుత్వ బస్సులకే పరిమితం చేశారని ఆయన అన్నారు.
” పంజాబ్ లో ప్రధాన మార్గాలలో నడిచే బస్సులలో 70 శాతం పైబడి ప్రయివేటు బస్సులున్నాయి. ఈ బస్సులలో మహిళకు ఉచిత ప్రయాణ పథకం వర్తించదు. కనీసం ప్రయివేటు బస్సులలో మహిళలకు చార్జీలు కూడా తగ్గించలేదు. ఇదే విధంగా ఎసి, వోల్వో బస్సులలో ఉచిత ప్రయాణం అనుమతించడం లేదు. పంజాబు ప్రభుత్వం బస్సులలో అంతర్రాష్ట్ర ప్రయాణానికి కూడా ఈపథకం వర్తించడం లేదు. కనీసం రాష్టం దాటే వరకు ఉచిత ప్రయాణం అనుమతించి , అపైన రాయితీతో టికెట్ తీసుకోవచ్చు. అదీలేదు. ఇదెం ఉచిత ప్రయాణ పథకం,’ అని చాధా విమర్శించారు.