తెలంగాణ అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లిలో జరిగిన దారుణమిది. కరోనా కారణంగా ఓ విద్యార్థిని ని ఊళ్ళోకి రానివ్వలేదు. దీనితో ఆమె భయం గుప్పిట్లో గడుపుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం. సాలేగూడకు చెందిన సోన్ దేవి గురుకుల కాలేజీలో ఇంటర్ చదువుతూ కరోనా బారిన పడింది. ఆమె ఇంటికి రావాలనుకుంది. ఆమెను ఊల్లొకి రాకుండా గ్రామస్థులు అడ్డుపడ్డారు. క్వారంటైన్ పూర్తయితేనే అనుమతిస్తామని తెగేసి చెప్పారు. దీనితో సోన్ దేవి ఊరి చివర్లో ఉన్న తమ పాలంలోనే ఐసోలేషన్లో ఉంటున్నది. మరో 4 రోజులు పూర్తయ్యాకే ఊళ్లో అడుగుపెట్టనిస్తామని చెబుతున్నారు.