తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని,
పెంచిన పదవి విరమణ వయసు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జెఎసి అసెంబ్లీ ముట్టడికి యత్నంచింది. రెండు రోజుల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వోద్యోగుల ఉద్యోగ విరమణ వయసును దేశంలో ఎక్కడాలేని విధంగా 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచిన సంగతి తెలిసిందే. దీనితో మరొక మూడేళ్లు ఎవరైరిటైర్ కారు.ఉద్యోగాల ఖాళీలు ఏర్పడవు. చాలా మంది నిరుద్యోగుల వయసు అయిపోతుంది. అందుకే ముఖ్యమంత్రి ప్రకటన నిరుద్యోగుల్లో బాగా అసంతృప్తికి దారి తీసింది. అందు కే ఈ రోజు అసెంబ్లీ ముట్టిడి కార్యక్రమం చేపట్టారు.
ముట్టడికి యత్నించిన నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.