కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు

ఈనెల 28 నుంచి  ఈ రోజు ప్రారంభమయిన కర్నూలు విమానాశ్రయం నుంచి  విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు సర్వీసులు నడుస్తాయి. ఒకేసారి 4 విమానాలు ఇక్కడ పార్కు చేసుకునే వీలుంది.

ఈ విమానశ్రయాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.దానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అని పేరు పెట్టారు.

‘1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్ర పోయిన ఒక మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఆయనకు నివాళిగా ఇవాళ ఈ విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  కర్నూలు విమానాశ్రయం’ అనే పేరు పెడుతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను’ అని ప్రటించారు.

‘ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 5 విమానాశ్రయాలు ఉండగా, ఇది 6వ విమానాశ్రయం కాబోతున్నది. ఇప్పటికే తిరుపతి, కడప, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో విమానాశ్రయాలు ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలో కర్నూలు విమానాశ్రయం కూడా చేరింది’.

‘ఈ ఓర్వకల్లు విమానాశ్రయం.. రాష్ట్రంలో మనందరం నిర్మించుకోబోతున్న న్యాయ రాజధానిని, మిగతా రాష్ట్రాలతో సమానంగా, గర్వంగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను’ అని విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.

‘ కర్నూలులో ఇక్కడే కచ్చితంగా విమానాశ్రయం రావాలని, పట్టుదలతో రూ.110 కోట్లు ఖర్చు చేసి, కేవలం ఏడాదిన్నరలోనే ప్యాసింజర్‌ టర్మినల్‌ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, అడ్మిన్‌ బిల్డింగ్, పోలీస్‌ బ్యారక్, ప్యాసింజర్‌ లాంజ్, వీఐపీ లాంజ్, వాటర్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంక్, సబ్‌ స్టేషను, రన్‌వేలోని బ్యాలెన్సు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం’ అని జగన్ అన్నారు.

ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న రెండు అత్యాధునిక అగ్నిమాపక శకటాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచామని ప్యాసింజర్‌ టర్మినల్‌ వద్ద కార్‌ రెంటల్, బేబీ కేర్, మెడికల్‌ కేర్‌ వంటి అన్ని సదుపాయాలు కల్పించామని ఆయన చెప్పారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *