ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి షర్మిల పోటీ చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆమె తరఫున కొండా రాఘవరెడ్డి ప్రకటించారు.
ముందు పార్టీ నిర్మాణం మీదనే తమ దృష్ఠి ఉంటుందని, పార్టీ ఏర్పాటు చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే ఉండదని ఆయన చెప్పారు. ఏప్రిల్ 8 వరకు ఖమ్మం సభకే ఇప్పుడు మా ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం లో నిర్వహించే సభకోసమే కోఆర్డినేటర్ ను పెట్టామని ఆయన చెప్పారు.
పార్టీ ప్రకటించకుండానే ఎన్నికలలో పోటీ పై ఆలోచన ఎందుకుంటుందని ఆయన అన్నారు.
ఏప్రిల్ 9న ఛలో ఖమ్మం
రండి…కదలి రండి… లక్షలాదిగా తరలి వచ్చి
సంకల్ప సభను విజయవంతం చేయండి
రాజన్న సంక్షేమ పాలన కోసం రాజన్న బిడ్డను
స్వాగతించండి – ఆశీర్వదించండివేదిక :- పెవిలియన్ గ్రౌండ్, ఖమ్మం #YSRForever #TelanganaWithYSSharmila #TeamYSSR #YSRTelangana pic.twitter.com/5ColFI5c1I
— Team YS Sharmila (@TeamYSSR) March 24, 2021