తెలంగాణలో క్రిటికల్ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్! అంటే ఐసియు చికిత్స అసవరమయ్యే కేసులు పెరుగుతున్నాయన్నమాట.
తెలంగాణలో ప్రస్తుతం రోజుకు 50 నుంచి 60 కరోనా పాజిటివ్ కేసులు కనిపిస్తున్నాయి.
దీనితో మొత్తం కరోనా కేసులు రెట్టింపవుతున్నాయి. సోమవారం నాడు 414 కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున కేసులు నమోదుకావడం జనవరి 5 తర్వాత ఇదే మొదటి సారి. 2021 జనవరి 5న తెలంగాణలో 417కేసులు నమోదయ్యాయి. సోమవారం నాడు జిహెచ్ ఎంసి ఏరియాలో నే 103 కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం.
పాజిటివిటీ రేటు కూడా తెలంగాణలో బాగా పెరుగుతూ ఉంది. పాజిటివిటి రేటు (Positivity Rate) అంటే పరీక్షించిన వారిలో ఎంతమందిలో కరోనా కనిపించింది అనేది.
మార్చి నెలారంభంలో పాజిటివిటి రేటు 0.45 శాతం ఉంటే మార్చి 22 నాటికి ఇది 0.9 శాతానికి చేరింది. అంటే రెట్టింపయిందన్న మాట.
మరోక ఆందోళన కరమయిన విషయమేమిటంటే, ఇపుడు కనిపిస్తున్నకేసుల్లో కోవిడ్ లక్షణా కనిపించడం లేదు. (Asymptomatic).ఇలా రోగలక్షణాలు కనిపించకపోతే, జాగ్రత్త తీసుకోవడం మానేస్తారు. అక్కడ ఇక్కడ తిరుగుతారు. కోవిడ్ ప్రొటొకోల్ పాటించడం నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు.
తెలంగాణలో ఇపుడు క్రిటికల్ కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయని గాంధీ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. ఈ మార్చినెలారంభంలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కేవలం 39 కోవిడ్-19 కేసులు మాత్రమే ఉండేవి క్రిటికల్ కండిషన్ లో ఉండేవి . మార్చి 22 నాటికి వీటి సంఖ్య 70కి చేరింది.
“ప్రస్తుతం గాంధీ ఆసుప్రతిలో 70 క్రిటికల్ పేషంట్లు ఉన్నారు.వీరిలో కొందరు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇంకొందరికి వెంటిలేటర్ ఏక్షణాన్నైనా అవసరం పడవచ్చు. వీళ్ల ఆక్సిజన్ శాచురేషన్ స్థాయి 85 కంటే తక్కువగా ఉంది. వాళ్లంతా సి-ట్యాప్ (C-tap) మీద ఉన్నారు. అంటే వాళ్లకి హై ఫ్లో ఆక్సిజన్ సప్లై అందిస్తున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎం రాజరావు తెలిపారు.
ఈ దఫా కరోనా దాడి మీద అటు కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని స్పష్టం రావడం లేదు. ఇది నిజంగా కోవిడ్ సెకండ్ వేవా కాదా అనే క్లారిటి రాలేదు. కొందరేమో సెకండ్ వేవ్ కాదంటున్నారు. సెకండ్ వేవ్అయినా తీవ్రత ఉండదని అంటున్నారు. కొందరేమో సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యప్తి చెందుతుందని, మరణాలు అంతగా ఉండవని చెబుతున్నారు. కొందరు సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని, ప్రమాదకరమని కూడా చెబుతున్నారు. మొత్తాకిని 2020 మార్చి నెలలో కరోనా వ్యాప్తి మీద గందరగోళమే ఇపుడు కూడా మొదలయింది.