పుస్తకావిష్కరణ ఆహ్వాన కరపత్రిక ఆవిష్కరణ
జనగామ, ఆదివారం 21: జనగామ కేంద్రంలోని ఎకాశిలా పాఠశాలలో ‘పోగుబంధం@ పుస్తకావిష్కరణ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి విద్యావంతుల వేదిక, రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు కోడం కుమార స్వామి, చేనేత సహకార సంఘం అధ్యక్షులు, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు వేముల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోడం కుమారస్వామి మాట్లాడుతూ ప్రముఖ సంఘ సేవకులు, రచయిత, జనగామ సామాజిక కవి, డాక్టర్ మోహనకృష్ణభార్గవ రచించిన ‘పోగుబంధం’ చేనేత జీవితాలకు దర్పణం వంటిదని, చేనేత కార్మికుల కష్టాలను, చేనేత కళ గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయాలనే రచయిత కాంక్ష అభినందనీయమన్నారు.
ఇది మోహనకృష్ణ రెండవ ముద్రిత పుస్తకమన్నారు. పుస్తకాన్ని కవితా దినోత్సవ సందర్భంగా ఆవిష్కరణ సభ కరపత్రిక ఆవిష్కరణ నిర్వహించినట్లు తెలిపారు.
వేముల బాలరాజు మాట్లాడుతూ ఈ సభకు మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ , మహిళాకార్పోరేషన్ చైర్మెన్ గుండు సుధారాణి , ప్రొఫెసర్ కోదండరాం, ఉస్మానియా జియోగ్రఫీ గెడ్ ప్రోఫెసర్ బాలకిషన్ , ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ వెల్ది రమేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మిట్టకోల సాగర్, పద్మశాలి సంఘ రాష్ట్ర నాయకులు గుండు ప్రభాకర్ , సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షులు రాపోలు సత్యనారాయణ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
రచయిత మోహనకృష్ణభార్గవ మాట్లాడుతూ ఈ సభకు కవులు, రచయితలు, సామాజిక సేవకులు, చేనేత కార్మికులు, సాహితీ ప్రియులు తప్పకుండా హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దోర్నాల వేంకటేశ్వర్లు, భోగ కైలాసం, మచ్చ బాలనర్సయ్య, దోర్నాల వేణు, వంగ వెంకట్ రాజ్, అంబటి బాలరాజు, వల్లాల మల్లేషం, గుమ్మడవెల్లి సత్యనారాయణ, చిదంబరం, పిట్టల సనత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..