విజయవాడ తో రాయలసీమను నేరుగా కలుపుతూ తొలిసారి రైలు నడవబోతున్నది.ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడ నుంచి ధర్మవరం (07215) జంక్షన్ మధ్య ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్నది. ఈ విషయాన్ని కడప చీఫ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ అమర్నాథ్ వెల్లడించారు.
విజయవాడ రాజధాని అని ప్రకటించినప్పటినుంచి రాయలసీమ వాసుల సౌలభ్యం కోసం రైలు నడిపేందుకు జరిపిన కృషి ఫలితం ఇది. అయితే, ఇపుడు రాజధాని అమరావతి నుంచి తరలిపోయే నాటికి ఈ కృషి ఫలించింది.
ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఈ కొత్త ఎక్స్ ప్రెస్ రైలు 9.45 గంటలకు విజయవాడలో బయలుదేరి నంద్యాల మీదుగా ఉదయం 4.59కి జమ్మలమడుగు చేరుకుంటుంది. ఉదయం 5.19 గంటలకు ప్రొద్దుటూరు, 6 గంటలకు ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
తర్వాత 6.10కి ఎర్రగుంట్ల నుంచి బయలుదేరి తాడిపత్రి, అనంతపురం మీదుగా ఉదయం 10.55 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది.
అలాగే ధర్మవరం నుంచి విజయవాడకు (07216) ఈఎక్స్ ప్రెస్ రైలు ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 5.30కు బయలుదేరుతుంది. రాత్రి 9.10కి ఎర్రగుంట్ల చేరుకుంటుంది. రాత్రి 9.40కి ప్రొద్దుటూరుకు 10.04కు జమ్మలమడుగు స్టేషనుకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 6.50కి విజయవాడ చేరుకుంటుంది