ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగారు బాగా నిగనిగలాడింది. దీనితో కొనే వాళ్లెక్కువయ్యారు. బిజినెస్ బాగా పెరిగింది. దానితో డిమాండ్ పెరిగింది. విదేశాల నుంచి బంగారు దిగుమతుల పెరిగాయి. 2021 ఫిబ్రవరిలో బంగారు విశేషాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది.
ఫిబ్రవరిలో నెలలో మొత్తంగా పది గ్రాముల బంగారు ధర 5.6 శాతం తగ్గి రు.46,425 ల సగటు ధర పలికింది.
చాలా కాలంగా బంగారు కొనాలనుకుంటూ ధరలు తగ్గుతాయని ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్న రిటైల్ కొనుగోలు దారులు బంగారు షాపులు వైపు అడుగులు వేశారు. ఇలా ప్రజలపెళ్ళిళ్లలకో, పండగలకో పబ్బాలకు బంగారు మార్కెట్ వైపు పరుగు తీయక 21 నెలలయింది.
దీనితో పెరిగిన డిమాండ్ ను తట్టుకునేందుకు భారతదేశం అధికారికంగా 91 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇంత పెద్ద ఎత్తున బంగారు దిగుమతి చేసుకోవడం 21 నెలల తర్వాత ఇదే మొదటి సారి. గత కరోనా ఏడాదితో పాలిస్తే బంగారు దిగుమతి 103 శాతం ఎక్కువ. జనవరితో పోలిస్తే 36. 5 శాతం ఎక్కువ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.
11 బ్యాంకులు, నామినేటెడ్ ఏజన్సీలు, ఎగుమతి దారులు కలిపి 77 టన్నుల బంగారు దిగుమతి చేసుకున్నాయి.
మరొక ముఖ్య విశేషమేమిటంటే, అధికారికంగా జరిగిన మొత్తం 91 టన్నుల బంగారు దిగుమతుల్లో 35.3 టన్నుల బంగారు చిత్తూరు జిల్లా శ్రీసిటి లోని ప్రీట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్ (FTWZ) నుంచి జరిగింది. ఇది కస్టమ్ బాండెడ్ వేర్ హౌస్. ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా వోవర్ సీస్ సప్లయర్లు ఈ వైర్ హౌస్ లోకి బంగారును దిగుమతి చేసుకోవచ్చు.
ఇక పోతే, ఈనెలలో రిజర్వు బ్యాంక్ 11.2 టన్నుల బంగారు సేకరించుకుంది. దీనితో రిజర్వు బ్యాంకు దగ్గిర ఉన్న బంగారు నిల్వలు 687.8 టన్నులకు పెరిగింది. రిజర్వు బ్యాంకు ఒక నెలలోనే ఇంత పెద్ద ఎత్తున బంగారును కొనుగోలు చేయడం ఒక రికార్డు. ఇటీవల కాలంలో రిజర్వు బ్యాంకు బంగారు నిల్వలను పెంచుకుంటూ ఉంది. విదేశీ మారక ద్రవ్యం డాలర్ల కంటే బంగారు సురక్షితం, సులభంగా నగదుగా మార్చుకునే వీలున్నందన ఆర్ బిఎ ఈ ఏర్పాటు చేసుకుంటూ ఉంది.
ఫిబ్రవరి నెలలో బంగారు ధరలు రిటైల్ కొనుగోలుదారులకు అనుకూలంగా మారేందుకు కారణాలు: 1. ప్రపంచమంతా కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలు కావడం 2. దీనితో ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయనే ఆశలు పెరగడం, ప్రపంచమంతా ప్రభుత్వబాండ్ల మీద రాబడి బాగా పెరగడం. ఇవన్నీ కలసి బంగారు ధరను కిందకు లాక్కొచ్చాయి. MCX గోల్డ్ స్పాట్ ధరలే కాదు, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ బంగారు ధర కూడా తగ్గింది. వీటికి తోడు ఫిబ్రవరి 1న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సెన్సెక్స్ 5 శాతం పెరగడం, కేంద్రం బడ్జెట్ వడ్డీరేట్లను మార్చకపోవడంతో కొనుగోళ్ల సందడి ఫిబ్రవరి నెల మధ్య దాకా కొనసాగింది. ఫిబ్రవరి మధ్యన సెన్సెక్స్ 12.7 శాతం పెరిగింది. తర్వాత నెలాఖరులో 6.6శాతం సన్సెక్స్ పడిపోయినా, ఫిబ్రవరి సెన్సెక్స్ పెరుగుదల 6.1 శాతం చూపింది. ఈ పాజిటివ్ సెంటిమెంట్ బంగారు ధరలు తగ్గేందుకు బాగా దోహదపడింది.
దీనితో ప్రజలు పండగల కోసం, పెళ్లిళ్ల కోసం ఫిబ్రవరిలో బంగారు బాగా కొన్నారు.