*స్కాలర్‌షిప్‌లలో బడ్జెట్ కోతలే కారణం
మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్య నమోదులో కేవలం 7.5% మాత్రమే ఉన్నారని వెల్లడించడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) జాతీయ కార్యదర్శి ఫవాజ్ షాహీన్ వ్యాఖ్యానించారు.
గత 2-3 దశాబ్దాలుగా మైనారిటీలలో, ముఖ్యంగా ముస్లిం సమాజంలో విద్య పట్ల అవగాహన పెరిగినప్పటికీ, విద్యా రంగంలో ఈ చారిత్రాత్మక అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అందించే మద్దతు నిరంతరం తగ్గిపోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఊహించినట్లుగానే , గత 6-7 సంవత్సరాలలో మైనారిటీ స్కాలర్షిప్లు, మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌లో స్థిరమైన బడ్జెట్ కోతలే ఈ పేలవమైన మైనారిటీ నమోదు సంఖ్యకు కారణమయ్యాయని ఫవాజ్ షాహీన్ అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. దీనితో పాటు మైనారిటీలలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి పాలసీలో జోక్యం చేయటం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు.