పోలవరం రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు పోలవరం గురించి మాట్లాడుతున్నాయి. అవినీతి దగ్గిర నుంచి ఎత్తు తగ్గించడం దాకా అన్ని కోణాలలో పోలవరం గ గురించి మాట్లాడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే, ఇందులో ని మానవీయ కోణాన్ని అందరూ మర్చిపోయారు. అంతా కలసి నిరక్షరాస్యులైన ఈ ప్రాజక్టు వల్ల వూర్లతో పాటు,సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక పునాదులను కోల్పోతున్న నిర్వాసితులను గాలి కొదిలేశారు.
నిర్వాసితులను మనుషుల్లా చూడండి, వాళ్ల పునరావాసం కోసం మావనవత్వం తో వసతులను కల్పించండి. ప్రాజక్టు కోసం వూర్లనుత్యాగం చేసిన ఈ నిర్వాిసితులను ఎక్కడెక్కడో స్థిరపరుస్తూ అక్కడ వసతులు లేకుండా చేస్తే వాళ్లెలా బతుకుతారు అని శక్తి సంస్థ పిటిషన్ లో పేర్కొంది. ఈ దారుణానికి సమాధానం చేెప్పేందుకు కేంద్ర జలవనరుల శాఖ,నీతియోగ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ కమిషనర్ దాకా ఈ నిర్వాసితులన పునరావాసంలో ఏదో విధంగా సంబంధం ఉన్న అందరిని ప్రతివాదులుగా పేర్కొంది. శక్తి తరఫున అడ్వకేట్ ఎస్ కె మూర్తిహైకోర్టులో వాదిస్తున్నారు. ప్రతివాదుల జాబితా ఇదే. పిటిషన్ కు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ( చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ల ధర్మాసనం) ఈ పిటిషన్ లో లేవనెత్తిన అంశాల మీద మార్చి 24లోపు స్పందించాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రస్తుతం గ్రామస్థులను ఖాళీ చేయించడం లేదని కోర్టు ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. అయితే, ఇది అబద్దమని, గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గిరిజనుల మీద వత్తిడి తెస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. జంగా రెడ్డి గూడెం మండలం, చల్లా వారిగుడెం గ్రామం వద్ద కు 14500 కుటుంబాల ను తరలించాలని చూస్తున్నారు.
పోలవరం ప్రాజక్టు కింద మునిగిపోనున్న తెల్లవరం, ములగల గూడెం గిరిజనులను మీద కూడా వత్తిడి తెస్తున్నారు. వాళ్లకి పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయాలంటున్నారు. కోర్టు కేసు నేపథ్యంలో గ్రామస్థులను తీసుకుని జంగారెడ్డి గూడెం ఆర్ డివొ, భూసేకరణ అధికారులను కలిసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గిరిజన నిర్వాసితుల తరఫున పోరాడుతున్న అడ్వకేట్ జువ్వాల బాబ్జీ అక్కడి దయనీయమయిన పరిస్థితి గురించి వివరిస్తున్నారు.
Ministry of Water Resources RD & GR rep. by its Secretary; NITI Aayog rep.
by its Vice Chairperson; Polavaram Project Authority rep. by its Member Secretary; National
Commission for Schedule Tribes rep. by its Vice-Chairperson; Ministry of Environment Forest
and Climate Change rep. by its Secretary; State of Andhra Pradesh rep. by its Chief Secretary;
The Special Commissioner–Resettlement & Rehabilitation, Government of Andhra Pradesh;
Principal Secretary, Social Welfare Department, Government of Andhra Pradesh;
Commissioner, Tribal Welfare Department, Government of Andhra Pradesh; District
Collector, East Godavari District; District Collector, West Godavari District; Project Officer,
Integrated Tribal Development Agency (ITDA), Rampachodavaram; Project Officer,
Integrated Tribal Development Agency (ITDA), K. R. Puram; Sub-Collector,
Rampachodavaram; Revenue Divisional Officer, Jangareddygudem; The Special
Collector(Land Acquisition),Indira Sagar Project; The Divisional Forest Officer, Eluru; Project
Officer, Integrated Tribal Development Agency (ITDA), Chinturu; The Project Administrator,
R&R – Irrigation Projects and Project Officer; Special Deputy Tahsildar, Integrated Tribal
Development Agency (ITDA), Rampachodavaram; The Divisional Forest Officer, Kakinada;
Commissioner, Department of Archaeology and Museums; Tahsildar, Polavaram.
పోలవరం నిర్వాసితులు గురించి న్యాయవాది చెబుతున్నదేమిటో ఈ వీడియో చూడండి.