సూపర్ హిట్ ‘జాతి రత్నాలు’ హైదరాబాదీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి మాస్ మహారాజా రవితేజ నుంచి ఆఫర్ వచ్చింది. తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా రవి తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎత్తయినా హీరోయిన్ గా సంచలనం సృష్టిస్తున్న ఫరియా ఇప్పటికే దేశవ్యాప్తంగా హెడ్ లైన్స్ లో వుంది. రవితేజ నటించ బోయే తర్వాతి మూవీ దర్శకుడు నక్కిన త్రినాధ రావు ఈ మేరకు ఫరియాని సంప్రదించినట్టు తాజా అప్డేట్. దీనికి అంగీకరించేదుకు ఫరియా సిద్ధంగా వున్నట్టు సమాచారం.
హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఫరియా అబ్దుల్లా, ‘జాతి రత్నాలు’ చిత్ర నిర్మాతను ఒక కాలేజీ ఈవెంట్ లో కలిశారు. ఫలితంగా థియేటర్ ఆర్ట్స్ లో ప్రవేశం వున్న ఆమెకు ఆడిషన్ కోసం నిర్మాత నుంచి పిలుపు వచ్చింది. ఆమె సెలెక్ట్ అవడం, సినిమా హిట్టవడం జరిగిపోయాయి. అయితే సినిమా హిట్టయిన తర్వాత రవితేజ నుంచి ఆఫర్ రాలేదు. అంతకి ముందే ‘జాతి రత్నాలు’ ప్రోమో చూసి రవితేజ దర్శకుడ్ని ఆమె వద్దకి పంపించారు.
ఫరియా అబ్దుల్లా హైదారాబాద్ లోని ప్రముఖ థియేటర్ గ్రూప్స్ అయిన నిశుంబితా, డ్రామానన్, సమహారా, టార్న్ కర్టెన్స్, ఉడాన్ లతో పనిచేసింది. ‘నక్షత్ర’ వెబ్ సిరీస్ లో నటించింది. ఆమెకు హిందీ ఉర్దూ ఇంగ్లీషు తెలుగు భాషలు వచ్చు. ఆమె తల్లిదండ్రులు సంజాయ్ అబ్దుల్లా, కౌసర్ అబ్దుల్లా. వయస్సు 23. ఎత్తు అయిదు అడుగుల 7 అంగుళాలు. సికిందరాబాద్ లోని లయోలా అకాడెమీలో మాస్టర్స్ చేసింది. నటన, నాట్యం చిత్రా లేఖనం లలో కృషి చేస్తోంది.