కొండా విశ్వేశ్వర రెడ్డి దారెటూ? బిజెపియా, సొంత పార్టీయా, లేక…కొత్త పార్టీయా?

కాంగ్రెస్‌ పార్టీకి మూడు నెలల పాటు దూరంగా ఉంటానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నట్లు వార్తలొస్తున్నాయి.అదే సమయంలో  భారతీయ జనతా పార్టీలో  చేరడం లేదనీ ఆయన అంటున్నారు.అయితే, 3నెలల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెబుతున్నారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వోడిపోవడం అటుంచితే,  2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చాలామందిని భవిష్యత్తు గురించి ఆలోచించుకునేలా చేసింది. కాంగ్రె స్ పనికిరాదని, రాజకీయాలకు కోసం ఏదో ఒక దారి వెదుక్కునేలా చేసింది.

కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు తప్పక వస్తాయని  కొంతమంది ఆశావాదులు అనుకుంటున్నారు. వాళ్లు కాంగ్రెస్ లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ లోనే ఏదో కార్యక్రమం చేపట్టి పార్టీ ఉనికి చాటుతున్నారు. ’కాంగ్రెస్ ఖేల్ ఖతం‘ అని అనుకున్నవాళ్లు టిఆర్ ఎస్ లోకి వెళ్లిపోయారు. టిఆర్ ఎస్ లో చోటు దొరకనివారు బిజెపిలోకి వెళ్లారు.  టిఆర్ ఎస్ నేత కెసిఆర్ ను ద్వేషించే వాళ్లు కాంగ్రెస్ లో ఉండలేక, బిజెపిలో చేరలేక ఎంచేయాలో తోచక సతమతమవుతున్నారు. వీళ్ల రాజకీయ భవితవ్యం గురించి బాగా వూహాగానాలు వస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి  ఈ జాబితాలో కి వస్తారు. ఆయన బిజెపిలో  చేరతారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోన్నది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి విజయంసాధించి, 2019 ఎన్నికల ముందు  టిఆర్ ఎస్ నుంచి వెనక్కి వచ్చారు.. కాంగ్రెస్ లో చేరారు. అదే చేవెళ్ల నుంచి పోటీ  చేసి ఓడిపోయారు. అక్కడేం జరిగిందో తెలియదు కాగాని ఆయన కెసిఆర్  మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు

ఈ మధ్య కెసిఆర్ ఫుట్టిన రోజు సందర్బంగా ఒక వీడియో ని  చైనా గ్రేట్ వాల్ నిర్మాతల గురించి చెబుతున్నట్లు విడుదల చేసి ముఖ్యమంత్రి తన  కసి ఎంత తీవ్రంగా ఉందో ప్రకటించారు. ఇపుడు మరొక ట్వీట్ చేసి తొందర్లో కెసిఆర్ కు ధరణి రూపంలో, రాష్ట్రం వరి పంట భారీ ఉత్పత్తి రూపంలో కష్టాలు వస్తున్నాయని చెప్పారు.

మొత్తానికి ఆయన కెసిఆర్ టార్గెట్ గా రాజకీయాలు నడపబోతున్నారని అర్థమవుతుంది. తనకు నచ్చని, తాను ద్వేషించే  కెసిఆర్ రాజకీయమర్మమేదో కొండాకి తెలిసినట్లుంది.

తన రాజకీయాలకు  అనువైన వేదిక కోసం వేచి చూస్తాన్నారా? కాంగ్రెస్ లో ఉంటూ కెసిఆర్ మీద ఎఫెక్టివ్ గా దాడి చేయలేమని భావిస్తున్నారా?మరయితే  ప్రత్యామ్నాయ పార్టీ ఏమిటి? బిజెపి  కాకుండా మరొక ప్రత్యామ్నాయం తెలంగాణలో ఏముంది?  కెసిఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ లో పుట్టుకొచ్చిన చిన్న చితకా పార్టీలేవీ బతికి బట్టకట్టలేకపోయాయి. ఇపుడు వైఎస్ జగన్ సోదరి షర్మిళ పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన అటువైపేమయినా చూస్తారా? లేక సొంతంగా పార్టీ పెడతారా?

తాను కాంగ్రెస్‌కు మూడు నెలలపాటు దూరంగా ఉంటానని కొండా ప్రకటించడం ఆలోచించాల్సిన విషయం. ఇపుడాయన కాంగ్రెస్ లో అంతయాక్టివ్ గా లేరు. అలాంటటపుడు ప్రత్యేకించి దూరంగా ఉండేదేముంటుంది?

కొండావిశ్వేశ్వరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో జెంటిల్మన్ లాగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.  జంటిల్మన్ పొలిటీషన్స్ కెసిఆర్ వ్యూహాలను ఎదుర్కొని నిలబడగలరా? కెసిఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేసేలా రాజకీయ చతుర్విద్యలు కొండా ప్రయోగించగలరా?

రాజకీయాల్లో పార్టీలు మారడం ఎపుడూ ఉన్నది. రాజకీయనాయకుల ‘ఒపీనియన్స్’ మారిపోతూఉంటాయి.అపుడే పార్టీలు మార్చేస్తారు. 125 సంవత్సరాలకిందటే తెలుగునాట ఈ సత్యాన్ని గుర్తించారు. అందుకే గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకం (1892)లో గిరీశం అనే సాంఘిక, రాజకీయా కామెంటేటర్ చేత ‘ఒపీనియన్స్ మార్చుకోని వాడు పొలిటీషన్ ఎలా అవుతాడు?’ అని అనిపించాడు. ఒక పదేళ్ల కిందట ఒక తెలుగుదేశం పెద్ద మనిషి పార్టీ మారబోతున్నాడని వార్తలొచ్చాయి. ఆయన ఎప్పటిలాగా  వీర ఖండన చేశాడు. చచ్చిపోతే నా శవం మీద కూడా తెలుగుదేశం జండానే కప్పుకుంటా చూడండి. అంతేకాని, పార్టీ మారనని  ఘోరశపథం చేశాడు. మాంచి కామెడీ సీన్ క్రియేట్ చేశారు.  ఈ ప్రకటనని ప్రజలింకా మర్చిపోక ముందే తెలుగుదేశం వదలిపోయాడు. అందువల్ల రాజకీయ నాయకులు ఒపీనియన్  మార్చకోవడం, పార్టీలు మారడం సహజం. మంచి రాజకీయ నాయకులు ‘మంచి” కోసం అని చెప్పి మారతారు. మిగతా నేతలు ‘ప్రజాసేవ’ కోసమని పార్టీ ఫిరాయిస్తారు. పార్టీ మారడం రాజకీయం. మొత్తానికి ఆయనకు కాంగ్రెస్ అనువైన వేదిక కాదని అర్థమవుతుంది. వచ్చే అదివారం ఆయన తన ట్విట్టర్ అభిమానులతో ఒక మీటింగ్ పెడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన అయిపోయింది కాబటి ఒక వారం రోజులు విరామం తీసుకుంటున్నానని, ట్టిట్టర్ లో కూడా కనిపించని చెప్పారు. వచ్చే ఆదివారం ట్వీపుల్ ట్విట్టర్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ఈ  లోపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి రెండు రూపాల్లో సంక్షోభం వస్తుందన, దాని గురించి ఆలోచిస్తూ ఉండండని పై ట్వీట్  పెట్టారు.

 

 

మూడు నెలల్లో కొండవిశ్వేశ్వర రెడ్డి కన్ ఫ్యూజన్ తొలిగిపోయి, ఒక స్సష్టమయిన నిర్ణయం , కెసిఆర్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన రాజకీయ నిర్ణయం తీసుకుంటారేమో చూద్దాం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *