అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మాజీ ప్రధాని పివి నరసింహారావు హోదాని ఎమ్మెల్సీ ఎన్నికల స్థాయికి దిగజార్చే, అవమానపర్చేలా తెలంగాణ రాష్ట్ర సమతి ఆయన బొమ్మను పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల అడగడానికి
టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్ర అభ్యంతరం తెలిపారు.
పివి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుక్కునే స్థాయి కి అధికార పార్టీ దిగజారడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పివి నర్సింహారావు చనిపోయినపుడు కనీసం దహన సంస్కారాలకు కూడా పోని కెసిఆర్ కు ఉన్నట్లుండి ఆయన మీద ఇంతప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో గుర్తించలేనంత అమయాకులు ప్రజలు కాదని, ఈనాటకాన్ని గమనిస్తున్నారని ఆచన ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి తరఫున ప్రచారం చేస్తూ అన్నారు.
‘పివి జాతీయ అంతర్జాతీయ నేత, ఆయనను ఒక ప్రాంతీయ పార్టీ కి ప్రచారంగా అదీ ఒక మండలి ఎన్నికల ప్రచారంగా వాడుకోవడం దురదృష్టకరం,’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆ పార్టీలో ఉన్న ఓటమి భయాన్ని వ్యక్తం చేసిందని ఆయన అన్నారు.
‘టిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఏడేళ్ల కాలంలో ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇది ప్రజల గుర్తిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఓడి పోతామనే భయం టిఆర్ ఎస్ ను పీడిస్తూ ఉంది. దీనికోసం మాజీ ప్రధాని పివి ఫోటో తో ఓట్లడిగి గట్టెక్కాలని చూస్తున్నారు,’ అని ఆయన అన్నారు.
అంటే కెసిఆర్ బొమ్మను మాత్రమే చూపితే ఓట్లు రాలే కాలంపోతున్నదని టిఆర్ ఎస్ గుర్తించిందని, ఇది ఆంతానికి ఆరంభమని ఆయన వ్యాఖ్యానించారు.
“పివి నర్సింహారావు జీవిత కాలం కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం, కాంగ్రెస్ పార్టీ విడదీయ రాని అంశాలు. ఆయన కాంగ్రెస్ పార్టీ లో సామాన్య కార్యకర్త నుంచి ఏఐసీసీ అధ్యక్షులుగా అయ్యారు.రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి గా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రి గా అయ్యారు. ఇంత గొప్ప మేధావిని ఇపుడు టిఆర్ ఎస్ ఒట్లను ఆకర్షించేందుకు వాడుకోవడం ఆయనను అవమానపర్చడం కాక ఏమవుతుంది?’ అని మల్లు ప్రశ్నించారు.
“కాంగ్రెస్ అభ్యర్థి జి. చిన్నారెడ్డి కి పివి ఫోటో పెట్టి వ్యాపార ప్రకటనలు ఇచ్చే పరిస్థితి లేదు. టిఆర్ఎస్ ఇచ్చిన ప్రకటనలో పివి ని గుర్తు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. పివి అభిమానులు కాంగ్రెస్ వైపు మాత్రమే ఉంటారు,’ అని మల్లు అన్నారు.
‘ఆయన బతికున్న కాలంలో ప్రధానిగా ఉండి తెలంగాణ కు ఏమి ఒరగబెట్టారని పివి నరసింహారావుు నిందించారు ఇప్పుడు రాజకీయాల కోసం లేని ప్రేమ వోలకబోస్తున్నారు, ఇవన్నీ తెలంగాణ ఓటర్లు గమనిస్తున్నారు. పివి ప్రచారం కచ్చితంగా కాంగ్రెస్ కు మేలు జరుగుతుంది,’ అని మల్లు రవి అన్నారు.