12న మాచర్లకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాక
జాతీయ పతాకా ఆవిష్కరణకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతారావమ్మ ను పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేదీన మాచర్ల విచ్చేయునట్లు మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి, అయన సోదరుడు పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. జగన్ ఆమెను సన్మానిస్తారు.
అదే రోజు,జాతీయ పతాకావిష్కరణ జరిగి నూరు సంవత్సరాలు అయిన సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారు.
పింగళి వెంకయ్య మచిలీపట్నం సమీపాన ఉన్న భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 2న జన్మించారు. 1963 జూలై4నమరణించారు. మహాత్మాగాంధీతో ఆయన 50 సంవత్సరాల అనుబంధం ఉంది. మొదట బ్రిటిష్ సైన్యంలో పనిచేసేటపుడు వెంకయ్య దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీని కలుసుకున్నారు.ఆపుడు ఆయన వయసు 19 సంవత్సరాలు. ఆ తొలి సమావేశంలోనే గాంధీ ఆయన మీద చెరగని ముద్ర వేశారు. అంతే, వెంకయ్య చివరిదకా గాంధీయన్ గా బతికారు.ఇపుడు గాంధీ యన్ అంటే విలువ లేదు గాని, అంత్యంత సాదాసీదా, నిజాయితీ గా సేవాభావంతో బతికేవారిని గాంధేయవాది అని గొప్పగా పిలిచేవారు. ప్రముఖ నేతల్ని పరిచయం చేపేటపుడు పరిచయవాక్యాలలో ‘ ఆయన గాంధేయవాది’ అని వాక్యం కనపడితే గొప్పగా ప్రశంసగా భావించేవారు. పింగళి వెంకయ్య ఈ తరహా గాంధేయవాది.
గాంధీ నాయకత్వంలో భారతదేశానికి తప్పని సరిగా స్వాతంత్య్రం వస్తుందని 1916నుంచే వెంకయ్య బలంగా నమ్ముతూ వచ్చాడు. అందుకే స్వతంత్ర భారతదేశానికి ఒక జండా ఉండాలి, అది ఎలా ఉంటే బాగుంటుందో 30 నమూనాలతో 1916 లోనే ఒక పుస్తకం ప్రచురించారు. 1918 నుంచి 1921 దాకా ప్రతికాంగ్రెస్ సమావేశంలో ఈ జండాల గురించి చెబుతూ వచ్చారు. చివర 1921, మార్చి 31న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మగాంధీ ఒక నమూనాను అమోదించారు. ఈ ఏడాది అందుకే జాతీయ జండాకు శత వత్సర సంబరం జరుపుకుంటున్నారు.
“Pingali Venkaiah who is working in Andhra National College Machilipatnam has published a book, describing the flags of the country and has designed many models for our own national flag. I appreciate his hard struggle during the sessions of the Indian National Congress for the approval of the Indian National Flag,” అని మహాత్మాగాంధీ Young India పత్రికలో ప్రశంసించారు.
వెంకయ్యకు అనేక భాషలు తెలుసు. 1913లో ఒక సారి జపాన్ లో ప్రసంగించి ఆయన అందరిని ఆశ్చర్యపరిచారు. అప్పటినుంచి ఆయనకు జపాన్ వెంకయ్ అని పేరొచ్చింది. కొద్ది రోజులు ఆయన మచిలీపట్నం నేషనల్ కాలేజీలో బోధించారు కూడా.
పింగళి వెంకయ్యకు భారత ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అనేక మంది మేధావులు, పౌరసంఘాలు, రాజకీయ పార్టీలు ఈ డిమాండు చేస్తూ వస్తున్నాయి. 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రానికి ఈవిషయం సిఫార్సు చేసింది. మాచర్లలో జాతీయ జండా నూరేళ్ల పండగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పింగళి వెంకయ్యకు భారత రత్న గుర్తింపు తెస్తానని హామీ ఇస్తారా
ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా మాచర్ల విచ్చేస్తున్నా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ఘనస్వాగతం పలికెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్బంగా కోరారు.