వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ప్రచారానికి వెళ్లిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చేదు అనుభవం ఎదురయింది.
ఆయన క్యాంపస్ లోకి రాగానే విద్యార్థులంతా వచ్చిచుట్టుముట్టారు.టిఆర్ ఎస్ కు పల్లాకు వ్యతిరేకంగానినాదాలు చేస్తూ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఆయన ముందుకుపోకుండా అడ్డుకోవడం జరిగింది.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమయ్యిందని వారు విమర్శించారు. ఇలాంటపుడు ఓట్లడగటానికి ఎలా వస్తావని ప్రశ్నించారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం యువకులకుద్రోహం చేసిందని నిరసన వ్యక్తం చేశారు. తర్వాత విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.