హెబ్బా హార్రిఫిక్ ఫస్ట్ లుక్!

టాలీవుడ్ రోమాంటిక్ బ్యూటీ హెబ్బా పటేల్ షాక్ ఇచ్చింది. ఈ రోజు విడుదల చేసిన ‘తెలిసిన వాళ్ళు’ ఫస్ట్ లుక్ నిజంగా షాకింగే. తలలేని మొండెంతో కుర్చీలో కూర్చుని వుంది. ఈ హార్రిఫిక్ ఫస్ట్ లుక్ తో మార్కెట్ లో తను బజ్ క్రియేట్ చేస్తోంది. ఇలాటి ఫస్ట్ లుక్ టాలీవుడ్ నుంచి ఇంతవరకూ రాలేదు. కుర్చీలో తన మొండెం, గోడ మీద తన ఫోటో ఫ్రేమ్!… మిస్టీరియస్ సన్నివేశమిది. సినిమాపట్ల ఇది బోలెడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. హెబ్బా ఘోస్ట్ గా నటిస్తోందా  అని ఉత్కంఠ/ ఈ సినిమాలో తను చైత్ర అనే పాత్ర నటిస్తోంది.

        ఈ మూవీ షూటింగ్ కంటే ముందే బజ్ క్రియేట్ చేసింది, మేకర్లు వేలాడించన్ కొత్త కాసేప్ట్ బజ్ కి కారణం విప్లవ్ కోనేటి దీనికి రచనా దర్శకత్వం నిర్వహిస్తున్నాడు. హెబ్బా లీడ్ రోల్ అయితే రామ్ కార్తీక్, నేష్, పవిత్రా లోకీష్ తదితరులు ఇతర తారాగణం. సంగీతం కోసం దీపక్ వేణుగపాలన్, ఛాయాగ్రహణం అజయ్ నాగ్ వి, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరల సాంకేతిక బృందం. నిర్మాణం సిరింజ్ సినిమా.

 

 

కాన్సెప్ట్ పోస్టర్…చూస్తేనే డర్

సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన అంటే ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలో హీబా పటేల్ తన సినీ కెరీయర్ లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ఉండగా ఇతర ముఖ్య పాత్రలలో యువ నటులు , టెక్నీషియన్స్ గా ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్లు కలిగిన ఈ చిత్రం అత్యున్నత ప్రామాణాలతో దాదాపుగా ఎనభై శాతం పూర్తయ్యింది. ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.
తెలిసినవాళ్ళు
నిర్మాత : సిరెంజ్ సినిమా
సమర్పణ : కేఎస్వీ ఫిలిమ్స్
కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం : విప్లవ్ కోనేటి
చాయాగ్రహణం : అజయ్ వి నాగ్
కూర్పు : ధర్మేంద్ర కాకరాల
సంగీతం : దీపక్ వేణుగోపాలన్
సాహిత్యం: డాక్టర్ జివాగో
కళ : ఉపేందర్ రెడ్డి
కోరియోగ్రఫీ : జావేద్ మాస్టర్ , శైలజ మాస్టర్
ఫైట్స్: సీ హెచ్ రామ కృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ : డా. జెకె సిద్ధార్థ
కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావ్
డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం , ధీరజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *