కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమాలు విడుదల కావడం, నిర్మాణాలు ఆగిపోయిన తెలుగు సినిమాలు పెద్ద సంఖ్యలో వున్నాయి. అదే సమయంలో కోవిడ్ సమస్య తగ్గుతున్నాక కొత్తగా నిర్మాణాలు ప్రారంభమయిన సినిమాలు 80 వరకూ వున్నాయి.
మొత్తం కోవిడ్ ఎపిసోడ్ లో ప్రేక్షకులు చూసేందుకు సినిమాలు లేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఊపందుకున్నాయి.
దీంతో ఓటీటీని దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమాల నిర్మాణాలు పెరిగాయి. 80 ఒకేసారి షూటింగులు జరుపు కోవడానికి కారణమిదే. ఏదేమైనా తిరిగి థియేటర్లు ప్రారంభమయ్యాక చిన్నా పెద్దా సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ శుక్రవారం ఒకేసారి 9 సినిమాలు విడుదల కావడం రికార్డు. ఇవన్నీ మీడియం, స్మాల్ రేంజి సినిమాలే. స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ‘షాదీ ముబారక్’ కూడా వుంది. సందీప్ కిషన్ నటించిన ‘ఏ వన్ ఎక్స్ ప్రెస్’ వుంది. వర్మ తీసిన ‘క్లైమాక్స్’ ఇదివరకే ఆన్ లైన్ లో విడుదలై, ఇప్పుడు థియేటర్స్ లో విడుదలవుతోంది. అయితే ఒకేసారి విడుదలవుతున్న ఈ 9 ఈ మీడియం, స్మాల్ రేంజి సినిమాలని ప్రేక్షకులెలా రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది!