మెట్రో శ్రీధరన్ కేరళ BJP ముఖ్యమంత్రి అభ్యర్థి

అందరిని ఆశ్చర్యపరుస్తూ ‘మెట్రోమన్’ (Metroman) గా పేరున్న ఇ శ్రీధరన్ ని పార్టీ చేర్చుకున్నారో లేదో, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేసింది భారతీయ జనతా పార్టీ. శ్రీధన్ కేరళ బిజెపిలోచేరారు. భారతదేశంలో ఆధునిక మెట్రోరైలు మార్గం నిర్మాణానికి ఆయన ప్రతీక్ అయ్యారు.ఢిల్లీ  మెట్రో రైలుతో ఆయన అంతర్జాతీయ కీర్తి ఆర్జించారు. ఆతర్వాత పలు రాష్ట్రాల మెట్రో ప్రాజక్టుల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అయితే, ఈ వయసులో రాజకీయాల్లోకి వస్తున్నారు. కేరళలో వచ్చిన ముఖ్యమంత్రుల తీరు మీద విసుగు చెందిన తాను బిజెపిలో చేరుతున్నట్లు ఆయన ఫిబ్రవరి 18న ప్రకటించారు. అంతేకాదు, బిజెపి పవర్ లోకి ముఖ్యమంత్రి పదవి చేపట్టానికి సుముఖమేనన్నారు.

అయితే, గురువారం నాడు కేరళ బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ ఈ విషయం ధృవీరించారు. శ్రీధరన్ బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు.

ఫిబ్రవరి 14, కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ సమక్షంలో చెంగరాంకులం లో జరిగిన బిజెపి ’విజయయాత్ర‘ ఆయన పార్టీ సభ్యత్వం స్వీకరించారు.

140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి  ఏప్రిల్ ఆరును ఎన్నికలు జరుగుతున్నాయి మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేరళని వామపక్షాల పట్టునుంచి తప్పించేందుకు బిజెపి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంది. ఇపుడు శ్రీధరన్ లంటి సాంకేతిక నిపుణులు రావడంతో పార్టీలో మార్పు గురించి ఆశలు చిగురిస్తున్నాయి. ఏమవుతందో చూడాలి.

బిజెపి లో 75 సంవత్సరాలు దాటిన వారికి టికెట్ ఇవ్వరాదనే నియమం ఉంది. దీని ప్రకారమే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు.

శ్రీధరన్ విషయంలో ఈ నియమాన్ని సడలించినట్లు కనబడుతున్నది.

కేరళలో తాను, లెఫ్ట్ ఫ్రంట్,  కాంగ్రెస్ నాయకత్వంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాలను చూశానని చెబుతూ ఈ రెండు ప్రభుత్వాధినేతలకు  రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేదాని కంటే తాము పైకి రావాలనే తపన ఎక్కువ గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే తాను భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నానని ఆయన మీడియాకు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *