దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల రాజకీయ పార్టీని ఏప్రిల్ 9న ప్రకటించవచ్చని అనుకుంటున్నారు. ఆ రోజున ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ఈ ప్రకటన చేస్తారని ఆమెతో రాజకీయ చర్చల్లో పాల్గొన్న నేతలు కొందరు చెప్పారు.
ఫిబ్రవరి 8న రాజకీయ పార్టీ గురించి షర్మిల సంచనల ప్రకటన చేశారు. తాను తెలంగాణ కోడలినని, పుట్టి పెరిగిందని హైదరాబాద్ లోనేనని చెబుతూ తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ అవసరం ఉందని ఆమె ప్రకటించారు.
అప్పటి నుంచి ఆమె వివిధ జిల్లాలలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులు, యువకులతో కూడా ఆమె సమావేశమయ్యారు. మార్చి రెండున మహబూబ్ నగర్ జిల్లా నేతలో సమావేశమవుతున్నారు. హైదరాబాద్ లోట స్ పాండ్ లో జరిగే ఈ సమావేశానికి సుమారు అయిదారు వందల మంది రావచ్చని అంచనా. చాలా కాలం తర్వాత ఇపుడు మళ్లీ లోటస్ పాండ్ రాజకీయ కార్యకలాపాలతో కళ వచ్చింది.గతంలో జగన్ మకాం తాడే పల్లికి మార్చనంతవరకు ఇక్కడ రాజకీయ సందడి ఉండేది. ఆయన ఆంధ్ర కు కార్యాలయం మార్చాక లోటస్ పాండ్ వార్తలనుంచి కనుమరగయింది. షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన చేశాక మళ్లీ ఈ ప్రాంతంలో కదలిక మొదలయింది.
షర్మిల జిల్లాల చర్చలు ఏప్రిల్ 9న ఖమ్మంలో ముగుస్తాయి. ఆ రోజున బహిరంగ సభ ఏర్పాటుచేసి పార్టీ పేరును ప్రకటిస్తారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
మహబూబ్ నగర్ జిల్లా వైయస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం వేదిక లోటస్ పాండ్ తేదీ :-02-03-2021 #YSRForever #TelanganaWithYSSharmila #TeamYSSR pic.twitter.com/hqEcXrhzXH
— Team YS Sharmila (@TeamYSSR) March 1, 2021
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే ధ్యేయం అంటున్నందన ఆమె పార్టీ పేరుకూడా ’రాజన్న రాజ్యం’ అని పెట్టవచ్చనే చర్చ నడుస్తూ ఉంది. అయితే, పార్టీ పేరులో వైఎస్ ఆర్ , తెలంగాణ అనే రెండు పేర్లు ఉండేలా కొత్త పార్టీకి నామకరణం చేయవచ్చని కూడా కొందరు వూహాగానాలు చేస్తున్నారు.
మొదట వైఎస్ ఆర్ జయంతి రోజు పార్టీ పేరును అట్టహాసంగా ప్రకటించాలనుకున్నారు. అయితే, ఆ తేదీన మరీ దూరంగా ఉన్నందున ఏప్రిల్ 9 కి మార్చినట్లు సమాచారం. పోతే, పార్టీ ప్రకటించాక ఆమె తెలంగాణలో పాదయాత్ర జరపుతారు. పాదయాత్ర తర్వాతే 2004లో వైఎస్ ఆర్, 2014లో జగన్ అధికారంలోకి వచ్చారు. అందువల్ల ఆమెకూడా తెలంగాణలోనిఅన్ని జిల్లాలు చుట్టివచ్చే విధంగా పాదయాత్ర రూపొందిస్తున్నట్లు సమాచారం.
షర్మిల మీద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెశిడెంట్ , మల్కాజ్ గిరి రేవంత్ రెడ్డి ఎంపి తీవ్రంగా దాడిచేస్తున్నారు. షర్మిలపార్టీ పెడితే, ముందుపెద్ద ఎత్తున వలస పోయేది కాంగ్రెస్ నుంచే అనే భయం పార్టీల ఉంది. అందువల్ల షర్మిల దాడి నుంచి కాంగ్రెస్ ను కాపాడుకునే బాధ్యత అధిష్టానం రేవంత్ కు అప్పచెప్పిందని చెబుతున్నారు. షర్మిల కు పోటీగా రేవంత్ కూడా తెలంగాణ పాదయాత్ర చేపట్టానుకుంటున్నారు. ఈ లోపు ఆయన షర్మిలను ఫెయిడ్ అర్టిస్టు లని వర్ణించారు. షర్మిల కెసిఆర్, బిజెపి సంయుక్తంగా కాంగ్రెస్ మీదకు వదిలిన బాణమని రేవంత్ తొలినుంచి విమర్శిస్తూ వస్తున్నారు.