ఇరకాటంలో కెటిఆర్, ఉద్యోగాల మీద కత్తులు దూస్తున్న ప్రతిపక్ష నేతలు

తెలంగాణ ప్రభుత్వం 1.3 లక్షల ఉద్యోగ ఖాళీలను పూరించిందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించినప్పటి నుంచి ఈ అంకెలను రుజువు చేయాలని ప్రతిపక్ష నాయకులు సవాళ్లు విసురుతున్నారు.

ఈ అంకెలు నిజమని, దాని మీద తాను బహిరంగ డిబెట్ కు సిద్ధమని కెటిఆర్ ప్రకటించడంతో ఇపుడు ఆయన్ని చర్చల్లోకి లాగేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు.

మొన్న  కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు సవాల్ విసిరి గన్ పార్క్ దగ్గరి అమర వీరుల స్తూపం వేదికగా చర్చకు రమ్మన్నాడు. కెటిఆర్ కోసం ప్రత్యేక పింక్ టవల్ కప్పిన కుర్చీ కూడా ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ఉస్మానియా నుంచి విద్యార్తులు, నిరుద్యోగులు వచ్చారు.

గంటల తరబడి వేచిచూసినా కెటిఆర్ రాలేదు. కెటిఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రిక్రూట్ మెంటు మీద  తప్పుడులెక్కలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని దాసోజు విమర్శించారు. తన లెక్కలు విడుదల చేస్తూ తెలంగాణలో  నామ మాత్రంగానే ఉద్యోగాలిచ్చారని అన్నారు. ఈ లెక్కలు తప్పని తెలిస్తే తాను ఇదే గన్ పార్క్ లో గొంతు కోసుకుంటానని చాలెంజ్ చేసి  దాసోజు వెళ్లిపోయారు.

అయితే సోమవారం నాడు కెటిఆర్ కు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాజుయేట్ ఎమ్మెల్సీ నియోజక వర్గానికి పోటీ చేస్తున్నమాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నుంచి మరొక గట్టి సవాల్ ఎదురయింది. ఉద్యోగాలెక్కడ ఇచ్చావో చెప్పాలని రామచందర్ రావు మంత్రి కెటిఆర్ చర్చకు ఆహ్వానించారు. ఆయన ఉస్మానియా యూనివర్శిటీని వేదిక చేసుకున్నారు. తాను ఉస్మానియా యూనివర్శిటీలో ఎదురుచూస్తున్నానని, చర్చకు వెంటనే రావాలని రామచందర్ రావు సవాల్ విసిరారు.

 

 

అది కెటిఆర్ కు అందేలా ట్వీట్ చేశారు.  I am here at Arts College, where are you @KTRTRS అని రామచందర్ రావు ట్వీట్ చేశారు.

దీనికి వ్యంగ్యంగా కెటిర్ సమాధానం ఇస్తూ తాను ప్రధాని మోదీ సృష్టించిన 12కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయో, జనధన్ అకౌంట్లలోకి ప్రధాని బదిలీ చేసిన రు. 15 లక్షలు ఎక్కడున్నాయో వెదుకుతున్నానని ట్వీట్ చేశారు.

దీనికి రామచందర్ రావు మళ్లీ స్పందిస్తూ, ఈ లెక్కలను ఎపుడైనా వెదుక్కోవచ్చు నని అన్నారు. ఇపుడు మళ్లీ దొంగలెక్కలు తయారు చేస్తున్నావా అని చురక వేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *