సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణలో పార్టీ పెట్టే ఏర్పాట్లలో బిజీ గా ఉన్న షర్మిల ఈ రోజు ఇవ్వాళ నల్గొండ జిల్లా నాయకులను సంప్రదించారు. లోటస్ పాండ్ కేంద్రంగా నాటి వైఎస్ ఆర్ అభిమానులతో ఆమె సంప్రదింపులు ప్రారంభించారు. మూడు రోజులకిందట కొంత మంది విద్యార్థులతో, నిరుద్యోగులతో మాట్లాడారు. ఈ
సమావేశంలో విద్యార్థులలో యువకులలో కెసిఆర్ ప్రభుత్వం మీద అసంతృప్తి వుండటం ఆమె దృష్టికి వచ్చింది. ఉద్యమసమయంలో వాగ్దానం చేసినట్లు తెలంగాణలో ఉద్యోగాలు రాలేదని, యువకులంతా నిరుద్యోగులయిపోయారని ఈ సమావేశంలో తెలిపారు.మీరు ఎవ్వరు కూడా నిరుత్సహపడవద్దు నేను మీ అందరి తరుపున నిలబడతాను,పోరాడుతాను అని శ్రీమతి వైయస్ షర్మిల భరోసా ఇచ్చారు.
తెలంగాణ కోసం మా నెత్తురు దారపోశాం… చివరకు మాకు మిగిలింది ఏందీ..
OU Student Naveen Speech #YSSharmila #YSRTPhttps://t.co/4pzDNCaJTs— Team YS Sharmila (@TeamYSSR) February 26, 2021
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యార్థి సంఘాలు,నిరుద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం
మీరు ఎవ్వరు కూడా నిరుత్సహపడవద్దు నేను మీ అందరి తరుపున నిలబడతాను,పోరాడుతాను అని భరోసా ఇచ్చిన శ్రీమతి వైయస్ షర్మిల pic.twitter.com/IFwM8dAXHv— Team YS Sharmila (@TeamYSSR) February 25, 2021
ఒక వైపు ఆమె కెసిఆర్ వదిలిన బాణమని, నరేంద్ర మోదీ వదలిని బాణమని చర్చ సాగుతూ ఉంటే మరొక వైపు ఈ రోజు ఆమె కొన్ని అసక్తికరమయిన విషయాలు చెప్పారు. ఆమె పార్టీ మీద టిఆర్ ఎస్ పెద్దల నుంచి ఇంకా అధికారక స్పందన రాలేదు. దీనికి కారణం, ఆమె నుంచి టిఆర్ ఎస్ కు పెద్ద కవ్పింపు లేకపోవడమే కావచ్చు. అయితే, మెల్లిగా ఆమె టిఆర్ ఎస్ ను విమర్శించకుండా ప్రజల దృష్టి ఆకట్టుకోలేమనే నిర్ణయానికి వస్తున్నట్లున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని స్పష్టంగా చెప్పారు. అంందుకే తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్య పాలన అవసరం ఉందని చెప్పారు.
పార్టీ ఏర్పాటుచేయాలన్న తన ఆలోచనుకు జిల్లా నేతల నుంచి మంచి స్పందన వచ్చింది, రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు విస్తృతంగా సాగుతాయని వెల్లడించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ఆమె చేసిన వ్యాఖ్యలు: జగన్మోహన్ రెడ్డి నేను వేరు కాదు. * జగన్మోహన్ రెడ్డి ఆయన పని ఆయనది నా పని నాది. అన్ని జిల్లా నేతల అభిప్రాయం తీసుకుంటానని అన్నారు. అయితే, వైఎస్ ఆర్, జగన్ మోహన్ రెడ్డిలా రైతుల సమస్య మీద పాదయాత్ర జరిపే విషయం గురించి స్పందించలేదు. ఎందుకంటే, వైఎస్ ఆర్, జగన్ లు అధికారంలోకి రావడానికి ఈపాదయాత్ర బాగా ఉపయోగపడింది.
అయితే, తన కార్యకలాపాల మీద తందర్లో మరింత క్లారిటి ఇస్తానని మాత్రం చెప్పారు.
తెలంగాణలో పార్టీ పెట్టేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఆమెకు ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు తెలిసింది.అన్ని పార్టీలలోఉన్నవైఎస్ ఆర్ అభిమానులు ఆమెకు మద్తుతు తెలుపుతన్నట్లు సమాచారం. అందుకే ఆమె పార్టీ ఏర్పాటుచేసే విషయం మీద ఇక వెనక్క వెళ్లకపోవచ్చని వైఎస్ ఆర్ అభిమానులు కొందరు చెప్పారు.
మార్చి 2, లోటస్ పాండ్ లోనే మహబూబ్ నగర్ జిల్లా వైఎస్ ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేస్తున్నారు. చాలా పద్దతి ప్రకారం ఆమె పార్టీ ప్రకటనవైపు వెళ్తున్న తీరును చూస్తే ఆమె ఎవరో అనుభవజ్ఞులే నడిపిస్తున్నారనే అనుమానం వస్తుంది.
Very interesting development in Telangana.