కృష్ణా జిల్లా పెడన బంగ్లా స్కూల్ వద్ద గల టీ స్టాల్ వద్ద కలెక్టర్ ఇంతియాజ్ ని ఈ ఫోటోలో చూడవచ్చు. కలెక్టర్లకు టీ స్టాల్ దగ్గిర ఏం పని ఉంటుంది? ఈ మధ్య కలెక్టర్లు టీ స్టాల్స్ దగ్గిర ఆగి, ఒక కప్పు టీ తాగి, స్టాల్ దగ్గిర చెత్త వేయవద్దని చాలా ఫ్రెండ్లీగా చెబుతున్నారు. దీనికి చాలా ప్రచారమొస్తూ ఉంది. దాని సత్ఫలితం కూడా కనిపిస్తూ ఉంది. ఈ పని చేసేందుకే కలెక్టర్ ఇంతియాజ్ ఈ పెడన టీ స్టాల్ దగ్గిర ఆగారు. అక్కడ శానిటేషన్ గురించి ఆరా తీశారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, టీ దుకాణం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ దుకాణం యజమానికి సూచించారు.
కొద్ది రోజుల కిందట విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ కూడా ఇలాగే చేశారు.
ఆ వార్త ఇక్కడ చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/vizianagaram-district-collector-hari-jawahar-style-of-fight-against-plastic-menace/