పంచాయతీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధైర్యం నూరిపోసేందుకు ఈ రోజు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి పార్టీ కార్యకర్తలతో సమావేశమయి ఓటమి కారణాలను తెలుసుకుంటారు.
2019 ఎన్నికల పరాజయం తర్వాత ఆయన కుప్పం రావడం ఇదే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ ల మధ్య బాగా ఫిర్యాదులున్నాయి.
వారి వల్లే పార్టీ దెబ్బతినిందని, ప్రజలలో పార్టీ బలంగా ఉందని, నాయకత్వంలో లోపం వల్లే ఎదురుదెబ్బతగిలిందనే విమర్శల మధ్య చంద్రబాబు ఎన్నికల వేడి ఇంకా చల్లారక ముందే కుప్పం వచ్చారు. 89 పంచాయతీలలో టిడిపి కేవలం 14ను మాత్రమే గెలుచుకుంది.
కుప్పం లో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న పంచాయతీ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డిని ఆయన పేరు పెట్టకుండా విమర్శించారు. కుప్పం సభలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో టిడిపిని ఓడిపోయిందని ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్నారని అంటూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాగే ప్రవర్తించి ఉంటే పుంగనూరులో ఆయన గెలిచే వాడా అని ప్రశ్నించారు. మంత్రి రామచంద్రా రెడ్డి నియోజవర్గం పుంగనూరు. ఇది పుంగనూరు, కడప కాదు. కబడ్దార్, వడ్దీతో సహా చెల్లించుకోకుంటారని హెచ్చరించారు. తాను మళ్లీ మళ్లీ వస్తుంటానని కార్యకర్తులకు హామీ ఇచ్చారు. ‘నేను ఇంతవరకు కసితీర్చాలనుకోలేదు. ఇపుడు మా వాళ్ల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇక నేను చూసుకోవలసి వస్తుంది,’ అని అన్నారు.
ఆయన స్వాగతం చెప్పినప్పటి ఫోటోలు
Sri @ncbn addressing the public- LIVE from Kuppam. https://t.co/BDYotxtPQk
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) February 25, 2021