రాష్ట్రంలో 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులను రేపటి నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, డిఈఓలు, బిసి, యస్సి, యస్టి, మైనారిటి శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులతో ఈ విషయమై మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
6 నుండి 8 వతరగతి వరకు క్లాసులను వీలైన మేరకు రేపటి నుండి లేదా మార్చి 1 లోగా ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
6 నుండి 8 వ తరగతులకు సంబంధించి 17.24 లక్షల మంది విద్యార్ధులతో పాటు ఇప్పటికే హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఉంటారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి ఎడ్యూకేషన్ మానిటరింగ్ కమీటీలు సమావేశమై 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి తెలిపారు.
ఉపాధ్యాయులు, విద్యార్ధుల భద్రత కోసం తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలలను మొదటి సారి ప్రారంభిస్తున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య రాహుల్ బొజ్జా, బీసి సంక్షేమ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీమతి దేవసేన తదితరులు పాల్గొన్నారు.