ప్రభుత్వం దృష్టికి ఆంధ్ర రేషన్ డోర్ డెలివరీ కష్టాలు

(బొప్పరాజు, చేబ్రోలు కృష్ణ మూర్తి)

గడపగడపకు రేషన్ పంపిణీ కార్యక్రమం అమలులో ఉద్యోగులు పొద్దున ఐదుల గంటలనుంచే విధులకు హాజరు కావలసి వస్తున్నదని, దీనితో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రెవిన్యూ అసోసియేషన్  సివిల్ సప్లైస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లింది.

పేదలకు రేషన్ పంపిణీ లో పారదర్శకతను పెంచి రాష్ట్ర ప్రజలకు సాంత్వన కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి  ముఖ్యమంత్రి  నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.  ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తే ఈ పథకం ఇంకా సత్ఫలితాలు ఇస్తుంది.

ప్రజా పంపిణీ క్షేత్రస్థాయిలో  VRO నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న రెవెన్యూ ఉద్యోగులు  ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు సత్వరం  పరిష్కారం కావలసిన అవసరం ఉంది.

దీనికోసం అసవరమయిన విధివిధానాల రూపకల్పన చేయాలని ఈ రోజు   ఆంద్రప్రదేశ్  సివిల్ సప్లైస్ కమిషనర్ తో చర్చించాము.

సమావేశంలో చర్చించిన విషయాలు

1) పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం ఐదున్నర గంటలకు మొదలవ్వాలి అంటే ఐదు గంటలకు ఈ పాస్ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి అంటే పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు తదితర సిబ్బంది వారి ఇంటి నుండి తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరి MDUs (Mobile Dispensary Units – మినీ క్యాబ్)ను సిద్ధం చేసుకుని వేళ కాని వేళల్లో విధులకు ప్రతి రోజూ హాజరు అవ్వాలి.

అంటే చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని మరీ ముఖ్యంగా మహిళా అధికారులు/ఉద్యోగినులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం. కేవలం నెలలో 20 రోజులపాటు ఇదే కార్యక్రమంలో ఉన్నందున, రెవెన్యూ ఉద్యోగుల రోజు వారీ విధులకు ప్రత్యేకంగా కాలపరిమితి ( Before SLP) లోపు చేయవలసిన పనులు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల పనులకు పూర్తిగా ఆటంకం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురి అవడం ద్వారా ఉన్నతాధికారులు మాపై అనవసర చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

2) అలాగే ప్రస్తుతం MDU లు ద్వారా జరుపుతున్న పంపిణీలో కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. అందులో ప్రధానంగా… ప్రస్తుతం వాడుతున్నటువంటి పాతకాలపు ఇపాస్ మిషన్ లకు బదులు కొత్తవి తీసుకొని, 2 జి సిమ్ టెక్నాలజీతో బదులు 4G సిమ్ టెక్నాలజీ కలిగిన మెషీన్లు గా అప్డేట్ చేయాలి.

అలాగే వెయింగ్ మిషన్లుకు బ్లూటూత్ కు బదులు వైర్ అమర్చినచో వేగంగా కనెక్టివిటీ పెరుగుతుంది. అదే విధంగా అన్ని పాత ఆడాప్టెర్లు స్థానంలో మెరుగైన కొత్త ఆడాప్టెర్లు వెంటనే సరఫరా చేయాలి.దీనితో  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇటువంటి ప్రజా పంపిణీ కార్యక్రమం విజయవంతముగా జరుగుతుంది

3) ఈ పథకము అమలుపై ఫిర్యాదుల కొరకు జిల్లాకు ఒకే ఒక టెక్నికల్ టీం పనిచేస్తున్నందువల్ల సకాలంలో ఫిర్యాదులు పరిష్కారం జరగడం లేదు. కనుక ప్రతి డివిజన్ స్థాయి లో ఒక టెక్నికల్ టీము ఏర్పాటు చేయాలి. దీని వలన ఫిర్యాదుల పరిష్కారం సత్వరమే జరుగుతుంది.

4) కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో క్రింద స్థాయి రెవెన్యూ ఉద్యోగులే ప్రత్యక్షంగా unload చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలనే దృక్పథంతో కొంతమంది చిరు ఉద్యోగులు ముందుగా వారి సొంత డబ్బులు సహితం ఖర్చు పెడుతున్నారు.

ఈ విషయాలను ఎంతో ఓపికతో పరిశీలించాలి. సివిల్ సప్లయిస్ కమిషనర్ గాఈ  చిన్న చిన్న సాంకేతిక పరమైన అంశాలను తక్షణమే పరిష్కరించాలి.  నిరుపేదల ఇంటింటికి నిత్యావసర సరుకుల సరఫరా కార్యక్రమం విజయవంతం చేయడంలో ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉద్యోగులు/అధికారులు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. ఉద్యోగులు కేవలం పంపిణీ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా MDUs ను motivate చేసి నిర్దేశించిన సమయానికి పంపిణీ చేసే విధంగా పర్యవేక్షణ మాత్రమే చేస్తే  వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు

జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో నేడో, రేపో వెంటనే వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించి వారికున్న అపోహలను నివృత్తి చేస్తామని, వారు నిర్వహించాల్సిన ఇతర పనులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *