‘అక్షరసేద్యం’ అనే కవితల సంపుటిని మాతృభాష దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి హెచ్ విద్యాసాగర్ రావు, సిబిఐ మాజీ జేడి లక్ష్మిణారాయణ, రిటైర్డ్ ఐఎఎస్ కే.వి రమణాచారి ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా రచయిత, భాషోపాధ్యాయురాలు ఐరేని కృష్ణవేణి కి సన్మానం జరిగింది. హైదరాబాద్ లోని బేగంపేట టూరిజం ప్లాజా లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహిత్యప్రియులు పాల్గొన్నారు.
రచయిత్రులంతా మాతృ భాషలో అక్షరాలతో సేద్యం చేయాలని భావించి అక్షారయాన్ విమెన్ రైటర్స్ ఫోరం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేదిక ద్వారా ఎందరో కవయిత్రి లను సమాజానికి పరిచయం చేస్తున్నారు. తెలుగు నేల విడిచి పరాయి ప్రాంతాలకు బతుకుబాటలో వలస పక్షులుగా బతుకుతున్న వారి పిల్లలు తెలుగు ను మరచి పోతే ఎలా అనే ఉద్దేశంతో నూతన పుస్తక రూపంలో అనేక కవితలు,గేయాలు,కథలు వెలువరిస్తున్నారు.
కవయిత్రి కృష్ణవేణి అమ్మ భాషలో తెలుగు తో అక్షర సేద్యం చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూనే ఆమె తెలుగు భావితరాలకు,తెలుగేతర ప్రాంతాల్లో ఉన్న మన తెలుగు జనానికి సులభంగా అర్థం చేసుకోనే విధంగా రచనలు ఉండటం తెలుగు భాషా వికాసానికి దోహదం చేస్తుందని వక్తలు కొనియాడారు. మరిన్ని రచనలు యిలాగే కొనసించాలని అభిప్రాయ పడ్డారు.