శాస్త్రవేత్త లెవరూ వూహించనన్ని అవతారాల్లో కరోనా వైరస్ ప్రత్యక్ష మవుతూ ఉంది. ఒక రోగ కారక క్రిమి ఇలా తన ఉనికిని ఇన్ని అవతారాల్లోకి మార్చుకోవడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ లోకి సిసిఎంబి శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం ఇండియాలో కరోనావైరస్ 7569 అవతారాలు(mutants) ఎత్తింది.ఇది అపూర్వం. అంటే ఈ వైరస్ ఇండియాలో కనిపించినప్పటినుంచి దీని కరోనా వైరస్ ఎలా మార్పు చెందుతూ వస్తున్నదనే దాని మీద సిసిఎంబి శాస్త్రవేత్తలు కన్నేసి వుంచారు. ఈ 7569 రకాలలో ఒక్క సిసిఎంబి గుర్తించిన అవతారాలే సుమారు 5 వేల దాకా ఉన్నాయని ఈ శాస్త్రవేత్తలు పరిశోధనా ప్రతం లో పేర్కొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం ఇందులో తెలంగాణ రకాలు 987 ఉంటే ఆంధ్రలో కనిపించినవి 296.
ఇలా అవతారాలు రెగ్యులర్ గా మార్చుకుంటూ కరోనావైరస్ కొత్త సవాల్ విసురుతూ ఉంది.
” చాలా దేశాలను కలవరపెడుతూ ఉన్న కరోనావైరస్ అవతారాలు భారతదేశంలో ఇంతవరకు పెద్దగా కనిపించ లేదు.ఇందులో మనిషిలోని ఇమ్యూనిటీని కూడా తప్పించుకునే శక్తి ఉన్న అవతారం E48K, బాగా వ్యాప్తి చెందే గుణం ఉన్నN501Y రకాలున్నాయి. ఈ రకాలు ఇండియాలో తక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం, వీటిని కొనుగొనేందుకు అవసరమయిన స్వీక్వెన్సింగ్ పెద్దగా జరగకపోవడమేనని అనుమానం.ఇండియాలో ఎన్ని అవతారాల్లోకి కరోనావైరస్ మారిందో లోతుగా తెలియాలంటే దేశమంతా కరోనా వైరప్ జనెటిక్ సీక్వెన్సింగ్ జరగాలని సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు.
భారతదేశంలో కొన్ని రకాల కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో N440K అనే కరోనా రూపం బాగా వ్యాప్తి చెందుతున్నది. ఒక ఏడాదికాలంలో ఇండియాలో కరోనా వైరస్ అనేక రూపాల్లోకి మారుతూ వస్తున్నది. ఇది ఇంకా కొనసాగుతున్నది. ఇందులో కొన్ని ఒక రకం (A3i) చాలా నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది. జూన్ 2020 నాటికి దీనిని అధిగమించి A2a అనే కరోనా అవతారం దేశమంతా వ్యాపించింది. గత ఏడాది ప్రపంచాన్నికుదిపేసిన కరోనా అవతారం ఇదే.
వ్యాక్సిన్ విరుగుడు వచ్చినా, మాస్క్ ధరించడం మానవద్దని,చేతులను శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించం మర్చిపోవద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.