‘పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మీద 234 దాడులు’

రెండో విడత పంచాయతీ ఎన్నికలపోలింగ్ ముగిసినాకూడా, అధికారపార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అరాచకాలు దాడులను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

టీడీపీ సానుభూతి పరులపై బెదిరింపులకు పాల్పడుతూ, తప్పుడుకేసులు పెడుతు న్నారని పార్టీ ప్రతినిధులు పిల్లి మాణిక్యరావు , సయ్యద్ రఫీ విమర్శించారు.

సోమవారం నాడు  గుంటూరుజిల్లాలోని రొంపిచర్ల మండలంలోని గోగులపాలెంలో 5వవార్డు మెంబర్ గా టీడీపీ సానుభూతిపరురాలు రాధమ్మ గెలిచిందన్న అక్కసుతో ఆమె ఇంటిముందున్న ప్రహరీని, రోడ్డునుసాయంతో ధ్వంసంచేసి, స్థానికప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని వారు తెలిపారు.

 

సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా టిడిపి సానుభూతి పరుల మీద జరిగిన దాడుల వివరాలు మీడియాకు వెల్లడించారు.వివరాలు:

తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనప్పటినుంచీ టీడీపీ సానుభూతిపరులపై రాష్ట్రవ్యాప్తంగా 234వరకు దాడులుజరిగాయి.

• బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేసిన ఘటనలు 832 జరిగితే, ఎన్నికలకోడ్ ఉల్లంఘనలు 72 జరిగాయి.

• హత్యలు 2 జరగ్గా, హత్యాయత్నాలు 31, దాడులు 93, కిడ్నాప్ లు 48, బెదిరిం పులు181, ఆస్తుల విధ్వంసాలు 70వరకు జరిగాయి.

• ఘటనలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదు.

• అధికారపార్టీ వారిపై చర్యలు తీసుకోవడానికి ఎన్నికల కమిషనర్ ఎందుకు సంకోచిస్తున్నారు.

• గతంలో శేషన్ లా నిర్భయంగా, నిష్పక్షపాతంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తేనే రాష్ట్రంలో రాజ్యాంగం రక్షింపబడుతుంది.

• టీడీపీ వార్డుమెంబర్ గ్రామంలోని వీధిని,ఇళ్లను ధ్వంసంచేసినందుకు గాను, నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నుంచి ఎస్ఈసీ జరిగిన నష్టాన్ని భర్తీచేయాలి.

• ఎమ్మెల్యేపై, పంచాయతీ కార్యదర్శిపై తక్షణమే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *