ప్రముఖ విప్లవ రచయిత త్రిపురనేని మధసూదనరావు సతీమణి ప్రభల కుమారి అంత్యక్రియలు సోమవారం ఉదయం 11. 30 గంటలకు తిరుపతిలోని గోవింద ధామం స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య సంప్రదాయేతర పద్ధతిలో అంత్యక్రియలు జరిగాయి.
ప్రబలకు మారి(73) ఆదివారం ఉదయం 8 గంటలకు తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో కన్ను మూసారు. ఆ మెకు కొడుకు విజయకుమార్, కుమార్తె బీనా దేవి ఉన్నారు. టీటీడీ కి చెందిన ఎస్. జీ. ఎస్. ఆర్ట్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తూ రిటైర్ అయిన మధు సూదనరావు 2004 లో మరణించారు.
కృష్ణా జిల్లా గుడివాడ సమీపం లోని నందివాడ గ్రామానికి చెందిన ప్రబల కుమారి మధు సూదనారావు జీవిత సహచరి గా ఆయన అడుగుజాడలలో నడిచారు. ఆయన అరెస్టయిన ప్పుడు, ఇతర నిర్భంధ సమయాల్లో నిబ్బరంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా నిలిచారు.
గత సోమవారం నుంచి ఆమె నారాయణాద్రి ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. గుండె, మూత్రపిండాలు, లివర్ , ఆర్థరైటిస్ సంబంధిత వ్యాధులతో ఆమె చాలా కాలంగా బాధపడుతున్నారు.
ఆమె కుమార్తె బీనా దేవి, కుమారుడు విజయకుమార్ కన్నీళ్ళతో తల్లికి అంతిమ వీడ్కోలు పలికారు. ఆమె పార్థివ దేహంపైన చంద్రశేఖర్ రెడ్డి, జ్యోతి, శ్రీరాములు ఎర్ర జెండా కప్పి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీనా దేవి మాట్లాడుతూ నాన్న ఆశయాలు, సిద్ధాంతాల కు అమ్మ వెన్నంటి ఉన్న దని, అమ్మే లేక పోతే నాన్న లేరని గా ద్గ దిక స్వరంతో చెప్పారు. నాన్న కష్టాల్లో, నష్టాల్లో అమ్మ నిలబడిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ త్రిపురనేని మధు సూదన రావు తో తనకున్న సన్నిహిత సంబం దాన్ని గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియల ను కరుణాకర్ రెడ్డి దగ్గరుండి నిర్వహించారు. అరసం అధ్యక్ష వర్గం సభ్యులు సాకం నాగరాజ మాట్లాడుతూ మధుసూదన రావు జీవితం లో ముఖ్య ఘట్టాలను గుర్తు చేస్తూ, వాటిలో ప్రభల కుమారి పాత్రను వివరించారు.
స్మశాన వాటికలో ప్రభల కుమారి కి నివాళులు అర్పించిన వారిలో ఆమె కుమార్తె, కుమారుడు తో పాటు అల్లుడు రఘు, త్రిపురనేని అభిమానులు కరుణాకర్ రెడ్డి, సాకం నాగరాజు, శైల కుమార్, రజనీ కాంత్ నాయుడు, నాగు లూరి దయాకర్, డాక్టర్ ఎం. ఎస్. బాలాజీ, తమటం రామచంద్రా రెడ్డి, సుధాకర్, గోపాల్, అరుణ, సుబ్రమణ్యం, వాకా ప్రసాద్, శంకర్, విశ్వనాథ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, రాఘవ శర్మ, నాగరాజు తదితరులు ఉన్నారు.
(సోషల్ మీడియా నుంచి)