తెలంగాణలో ఒకప్పుడు డైనోసార్స్ తిరిగేవి… అందునా అదిలాబాద్ జిల్లాలో…

ఎక్కడి బెంగాల్? ఎక్కడి ఆదిలాబాద్? ఇది వినడానికి నక్కకు నాగలోకానికి ఉన్న సంబంధం లాగా లేదూ?
పైకి అలా అనిపిస్తుంది కాని, ఆదిలాబాద్ కు విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కు సంబంధం ఉంది.
ఎలాగేంటే …

ఆదిలాబాద్ జిల్లాలో దొరికిన ఒక డైనాసార్ అవశేషానికి టాగోర్ పేరు పెట్టారు.  దీని పేరు బారపాసారస్ టాగోరి (Barapasaurus Tagorei ). చిత్రంగా ఉంది కదూ. జురాసిక్ సినిమా చూసి మీరంతా డైనోసార్ లు  కొన్ని లక్షల సంవత్సరాల కందట ఏక్కడో ఆఫ్రికాలోనే సంచరించాయని అనుకుంటున్నారా.

కాదు, అవి మన గోదావరి-ప్రాణహిత లోయల్లో కూడా సంచరించాయని తెలింది. దీనికి Barapasaurus Tagorei యే సాక్ష్యం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఇది  60అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పలు, 20 టన్నులు బరువు ఉంటుందని అంచనా. 1961 లో జరిపిన తవ్వకాలలో మొత్తం ఆరు జంతువుల ఎముకల నిధి శాస్త్రవేత్తలకు దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇలా డైనోసార్ల నిధి దొరకలేదు.

ఈ రాక్షస బల్లుల తెలంగాణ ప్రాంతంలో  లోవర్ జురాసిక్ (Lower Jurassic period) కాలంలో నివసించాయి. లోవర్ జురాసిక్ కాలం 201.3  మిలియన్ సంవత్సరాల కిందట మొదలై 174.1 మిలియన్ సంవత్సరాల కిందట ముగిసింది.

బారపసారస్ టాగోరిని కనుగొనడంతో జురాసిక్ యుగం తొలినాళ్లలో పెద్ద పెద్ద రాక్షస బల్లులు లేవనే వాదన తప్పని తెేలింది.  అదిలాబాద్ కు ఇంతటి జీవ చరిత్ర ఉంది. అయితే, టాగోరీ డిస్కవరి కి నాయకత్వవహించింది పిసి మహలనోబిస్. ఆయన  రవీంద్రటాగోర్ కు మిత్రుడు. ఈ డిస్కవరీ టాగోర్ శతజయంతి సంవత్సరంలో  జగడంతో అదిలాబాద్ డైనో సార్ కు టాగోర్ పేరు పెట్టారు.

భారపారస్ అనే పదానికి అర్థం ఏమిటంటే బార అంటే పెద్ద, భారీ అని అర్థం, పా అంటే పాదాలు. సారస్ అనే గ్రీకు మాటకు అర్థం బల్లి అని. అన్నీకలిపితె ఇది పెద్ద కాళ్లున్న బల్లి. దీనితో పాటు కాశ్వాన్ మరికొన్ని ఆసక్తికరమయిన విషయాలను ట్విట్లర్ లో  వెల్లడించారు. భారతదేశంలో డైనోసార్లు లేవనుకోరాదు. మొదటి డైనోసార్ అవశేషాలు 1828లో కనిపించాయి. వీటిని జబల్ పూర్ కంటోన్మెంట్ లో ఆర్మీఆఫీసర్ కెప్టెన్ డబ్ల్యు హెచ్ స్లీమన్ కనుకొన్నారు.  ఇలాగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా డైనోసార్ పార్కులున్నాయి. ఇక్కడ పార్కులు  అంటే ఈ రాక్షస బల్లులు సంచరించిన ప్రాంతాలు అని అర్థం. అంటే భారతదేశంలో డైనోసార్లను అధ్యయనం చేయబట్టి  175 సంవత్సరాల పైబడే అయిందన్నమాట.

అయితే, ట్రెండింగ్ తెలుగు న్యూస్ దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమయిన విషయాలను అందిస్తూ ఉంది.

ఈ శిలాజం (Fossil) గోదావరి ప్రాణహిత పరీవాహక ప్రాంతంలో దొరికింది. ఇది మొదట కనిపించింది 1958లో. తర్వాత 1961లో తవ్వితీశారు.  నిజానికి ఇది ఆ ఏడాదిలోనే ఇది  ‘గ్రేట్ డిస్కవరి’ అని  జియాలజిస్టులు చెబుతారు. 1962 నేచర్ జర్నల్ లో ఈ పరిశోధన గురించి వ్యాసం అచ్చయింది. మొదట ఈ అవశేషాలు ఆదిలాబాద్ జిల్లా ప్రాణహిత-గోదావరి  లోయలో కనిపించాయి. తర్వాత పోచంపల్లి, లింగాల,క్రిష్టాపూర్, మెట్ పల్లి, యమన పల్లిలలో కనిపించాయి.

 

ఈ డిస్కవరీకి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉంది. కలకత్తాలోని  ఇండియన్ స్టాటిస్టిటికల్ ఇన్ స్టిట్యూట్ (ISI) జియోలాజికల్ స్టడీస్ రీసెర్చ్ యూనిట్ వారు ఈ శిలాజాన్నికనుగొన్నారు.

ఇది పూర్తి గా చెక్కుచెదరకుండా దొరికిన శిలాజం కావడం మరొక విశేషం. శిలాజాన్ని కొనుగొనింది విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ శతజయంతి సంవత్సరం కావడంతో దీనికి ఆయన పేరు పెట్టాలనుకున్నారు. ఎందుకు, సైంటిఫిక్ పరిశోధనకుల కవుల పేర్లు పెట్టడం ఎపుడైనా విన్నారా లేదు.

ఇంత   పూర్తిగా చక్కగా ఉండే శిలాజం (కింద రెండో ఫోటో) భారతదేశంలో దొరకడం ఇదే ప్రథమం.

credits: scroll

అంతేకాదు, డైనోసార్ పరిణామానికి సంబంధించి కనిపించకుండా సతాయిస్తున్న ఒక లింక్ దీనితో దొరికిపోయింది.

ఈ డిస్కవరీకి లండన్ రాయల్ సొసైటీ రు. 15,000 గ్రాంటు ఇచ్చింది. ఈ డిస్కవరీలో పాల్గొన్నవారి పేర్లు: డాక్టర్ పామెలా రాబిన్సన్, డాక్టర్ ఎలెక్ స్మిత్ ( యూనివర్శటీ ఆఫ్ లండన్), లతోపాటు ఐఎస్ ఐ కి చెందిన డాక్టర్ రాయ్ చౌదరి, డాక్టర్ ఎస్ ఎల్ జైన్, తపన్ కుమార్ చౌదరి.

అలా ఆదిలాబాద్, రవీంద్రనాథ్ టాగోర్ ను కలుపుతూ బారపాసారస్ టాగోరి (Barapasaurs Tagorei) అనే పేరు తయారయింది. బారాపసారస్ టాగోరీ అనేది జురాసిక్ యుగానికి చెందిన Sinemurian Age లో జీవించింది. నేల మీద సంచరించే జీవి. ఇది శాకాహారి. గుడ్లు పెట్టేది.

టాగోర్ కు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ అంటే చాలా అభిమానం. స్టాటిస్టిక్స్ అనే మాటకు బెంగాల్ లో రాశివిజ్ఞాన్ లేదా రాశి విద్య అని అర్థం చెప్పాడు.

ఈ సంస్థను స్థాపించిన పిసి మహలనోబిస్ ఆయనకు మంచి మిత్రుడు కూడా. అందుకే ఈ సంస్థ మ్యాగజైన్ ప్రారంభసంచికలో టాగోర్ ఒక కవి కూడా రాశారు. టాగోర్ స్థాపించిన విశ్వభారతికి మహలనోబిస్ పదేళ్ల పాటు తొలిజాయింట్ సెక్రెటరీగా కూడా ఉన్నారు.

నిర్లక్ష్యం

గోెదావరి-ప్రాణహిత లోయనుంచి దాదాపు పదిటన్నుల పాజిల్  బోన్స్ ను ఇక్కడ తవ్వి తీసి కలకత్తాకు  తీసుకువచ్చారు. నిజానికి జియాలజిస్టులకు, పురాతత్వ శాస్త్రవేత్తలు ఇవి కనిపించిన రోజున పండగ చేసుకున్నారంటే నమ్మండి. 1977లో ఈ ఎముకలను పేర్చి డైనో సార్ తయారు చేశారు. ఆసియాలో ఇలా పూర్తిగా దొరికి డైనో సార్ ఇదే. దీనిని చిన్ననమూనాని 1995  రిపబ్లిక్ పరేడ్ లో కూడా ప్రదర్శించారు.

అయితే, ఇంత విలువయిన డిస్కవరీ ఇపుడు ప్రజలకు అందుబాటులో లేదు. కలకత్తాలోని స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ ఇండియాలో ఒక రూం పెట్టి తాళం వేశారని స్క్రోల్ రాసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *