(నిరారె)
నీ ఇచ్చుడు పాడుగాను
ఇచ్చీ ఇచ్చీ ఇచ్చీ మా గాజెలన్ని నింపవడితివి
ఇప్పటికిరవైసార్లిత్తివి
కడుపునిండదాయె కాలుగదలదాయె
అది నోరా తాటిమట్టనా
కరవాలం చేతిలున్నదని ఏదివడితదే నరకవడితి
నమ్మినోనికూడును నంజుకు తినవడితివి
నీ ఇంట్లనించిచ్చినట్లు గల్మకాడ పడిగాపులుగాయవడితిమి
నీ నోటిమాటకై శెవులన్నీ రెక్కించవట్టె
ఆ ఎర్రిబాగులోళ్లు గుద్దినంతకాలం
మన బతుకులింతేలే
కాళ్లుమొక్కితే శెభాషనుకుంటిమి
ఆ గురుభక్తికి ఫిదా అయితిమి
ఇప్పుడు గురువు గుండెలమీద
తన్నవడితివి
మానసపుత్రికతో మైలపోల్దియ్యవడితివి
అవునులే
స్వామికార్యం స్వకార్యం ఏకకాలంలో
నీకు నువ్వే సాటి
మణులడిగామా మాణిక్యాలడిగామా
ప్రజాసేవకు ప్రజాదన్నేగా
నాన్చీ నాన్చీ నాన్చీ అంతా నాకవడితివి
అన్నీ జవాబుల్లేని ప్రశ్నలే
పురిట్లోనె పీకవిసకడం నీకలవాటేలే..
నువ్వో తోపనుకుంటిమి
మాకు ఏకుమేకై కుసుంటివి
గల్లాపెట్టెను జేబులోవెట్టుకొని
ఖాళీగురిగిని కళ్లముందుంచితివి
ఏడ కాలువెడుతున్నవో
ఏడ శెంగలిత్తన్నవో
తంగెడుపూలకెరుకేలే
నీ నకశెకలన్నీ
ఇక నాలుగు రోజులే
ఎదురుగాలి వీస్తోంది
గడ్డెక్కుడు కష్టమే
గిట్లైతే