ప్రజలు కోరుకున్నపుడు మాత్రమే ఏకగ్రీవాలు అవుతాయి.. ఏకగ్రీవాలు అయిన గ్రామాల్లో ప్రజలను అభినందించాలి. అందరూ కలిసి పోటీ లేకుండా ఒక సర్పంచ్ ను ఎన్నుకుంటే శుభపరిణామం. అయితే,చాలా గ్రామాల్లో ఆ వాతావరణం చెడ గొట్టడానికి టీటీపీ ప్రయత్నం చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యానించారు.
ఏలూరు పార్లమెంట్ జిల్లా పరిధిలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైస్సార్సీపీ బలపరచిన అభ్యర్థులు గెలుపు సందర్భంగా పార్టీ నేతలతో వారు సమావేశమయ్యారు.
ఏలూరు పార్లమెంట్ పరిధిలో అసంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించిన వైస్సార్సీపీ పరిశీలకులతో మంత్రి ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడారు.
వారిరువురు ఎక్రగీవ ఎన్నికల మీద ఏమన్నారంటే..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకు వెళ్లి వైస్సార్సీపీ మద్దతుఇచ్చిన అభ్యర్థులు విజయ బావుట ఎగుర వేయడానికి నియోజకవర్గం శాసన సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామ నాయకుతో కృషి చేయాలి.
ఏ రాజ్యాంగం అయినా, ఏ రాజకీయ పక్షమైనా మంచిని, శాంతిని కోరుకునే వాళ్లూ ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి.
రాష్ట్రములో రాజకీయ పార్టీల ప్రమేయం లేని ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ ఏకగ్రీవాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతయినా ఉంది..
స్థానిక సంస్థల ఎన్నికలలో టీటీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ను ప్రలోభపెట్టి, మాయలు చేసి ఏకగ్రీవాలను ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అంతిమo గా విజయం వైస్సార్సీపీ బల పరిచిన అభ్యర్థులదే.
రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందని పార్లమెంట్ లో టీడిపీ ఎంపీ లు ఆరోపణలు చేస్తున్నారు.
గ్రామాల్లో టీటీపీ నుండి వందలాది మంది వైస్సార్సీపీ లో చేరుతున్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాజకీయ రహితంగా పెద్దలు అంతా మాట్లాడుకొని ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు.
టీటీపీ నుండి ఇతర పార్టీల్లోకి నాయకులు, కార్యకర్తలు వెళ్ళుతుంటే మత కలహాలు మత మార్పిడిలు అని టీటీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.
జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ళ పల్లి జయప్రకాశ్, బొద్దాని శ్రీనివాస్, మంచేమ్ మై బాబు, నూక పేయి సుధీర్ బాబు, ఏపి మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వర ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు..