అమరావతి : ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పనివేళలు మారాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పని చేస్తాయి. ఈ మేరకుప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం పూట పిల్లలు చురుకుగా ఉంటారని, వాళ్ల మెదడు పూర్తి ఎనర్జీతో ఉంటుందని, అలాంటి ఉదయపు సమాయాన్నివిద్యా బోధనకు సాధ్యమయింత వరకు ఎక్కువగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన మేరకుటైమింగ్స మార్చారు.
మన బడి, నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీనితో పని వేళలు మారుస్తూ ఉత్తర్వు జారీ అయ్యాయి.
చాలా పాశ్చాత్య దేశాలలో కూడా ఉదయాన్నే తరగతులు ప్రారంభమవుతున్న విషయాన్ని కూడా ఆయన సమావేశంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఈ విధానాం ఎందుకు పాటించరాదో ఆలోచించండిన ఆయన అధికారులనుసూచలనిచ్చారు.
ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించ గలుగుతుందని, ఆ సమయంలో పాఠ్య బోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకో గలుగుతారని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటల కల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదని చర్చలో చాలా మంది అభిప్రాయపడ్డారు.
కొత్త టైమింగ్స్ లో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటల కల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.