తెలుగు రాష్ట్రాలలో మొత్తానికి పది నెలల కోవిడ్ విరామం తర్వాత సోమవారం నాడు పాఠశాలు తెరుచుకున్నాయి. తెలంగాణలో మొదటిరోజున 45 శాతం మంది హాజరయ్యారు. చాలా కాలం తర్వాత పాఠశాలలకు రావడం పిల్లల్లో ఆనందం నింపింది. స్నేహితులను సంతోషంగా పలకరించుకోవడం కనిపించింది. రకరకాల పద్ధతుల్లో పిల్లలు పాఠశాలలకు, హైస్కూళ్లకు రావడం మొదలయింది. చాలా మటుకు కోవిడ్ నియమాలు పాటిస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల వాటిని ఖాతరు చేయడం లేదు. పిల్లలు సైకిళ్ల మీద, బస్సులలో, ఆటోలలో ఎప్పటిలాగానే పాఠశాలకు రావడం మొదలయింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో విద్యార్థులు ప్రమాదకరమైన పద్ధతిలో ప్రయాణా ప్రయాణిస్తూ పాఠశాలకు వెళ్లున్నప్పటి ఫోటో ఇది.
గిద్దలూరు పట్టణానికి చదువుకునేందుకు వివిధ కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు సరైన బస్సు వసతులు లేక బస్సు పాసుల సౌకర్యం ఇప్పటివరకు కల్పించక పోవడంతో విద్యార్థులు వారి గ్రామాల నుండి కళాశాలలకు ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్త వైరలయింది. ఫోటోలో ఎవరికీ మాస్కులేకపోవడం గమనించాలి.
షేరింగ్ ఆటోలలో ఉన్నట్లుండి విద్యార్థులు నుంచి డిమాండ్ రావడంతో ఎక్కువ మందిని ఆటోలలో ఎక్కించుకుంటున్నారు. ఇది క్షేమం కాదని అధికారులు చెప్పాలి.
కొన్ని ప్రయివేటు మేనేజ్ మెంట్లు ఇంకా పాఠశాలల బస్సులను పూర్తిగా నడపడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం 9,10, ఇంటర్ క్లాసులకు 45 మంది హాజరయ్యారు. 9,59,914మంది విద్యార్థులు ఈ క్లాసులలో ఉంటే 4,43,507 మంది హాజరయ్యారని పాఠశాలల విద్యా డైరెక్టొరేట్ ఒకప్రకటనలో తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలలలో అటెండెన్స్ మరీ తక్కువ కేవలం 11 శాతమే.
ప్రయివేటు పాఠశాలలో పరిస్థితి మెరుగుపడాలంటే మరొక వారం పదిరోజులు ఆగాలి. ముఖ్యంగా రెసిడెన్సియల్ పాఠశాలలకు పిల్లలను పంపేందుకు తల్లితండ్రులు వెనకాడుతున్నట్లు తెలిసింది. చాల మంది తల్లితండ్రులు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ ఒక డోసైనా వేస్తే వారు పిల్లలను ధైర్యంగా స్పూలుపంపిస్తారు. వ్యాక్సిన్ కోసం ఎదరుచస్తున్నామని, కొంతమంది తల్లితండ్రులు ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు తెలిపారు. పట్టణ ప్రాంతాలలోని తల్లితండ్రులు, ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడిన పిల్లల తల్లితండ్రులుమాత్రం మరికొంత కాలం ఆగేందుకు సుముఖంగా నే ఉన్నారు.
పిల్లలను పాఠశాలలకు పంపవచ్చనే ధైర్యం ప్రజలలలో వస్తూనే అటెండెన్స్ పెరుగుతుందని తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో తరగతికి కేవలం 20 మందిని అనుమతిస్తూ పాఠశాలలను పున: ప్రారంభించారు.