నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో కవిత్వం

పార్లమెంటులో  బడ్జెట్ ప్రవేశపెడుతున్నపుడు ఆర్థిక మంత్రులు తమకు ఇస్టమయిన  కవుల కవితలనో, గజల్స్ నో  ఉదహరించడం ఎప్పటి నుంచో జరుగుతున్నది. తమ బడ్జెట్ ఫిలాసఫీ ప్రజలకు అర్థమయ్యేందుకు ఇలా  బాగా ప్రాచుర్యంలో ఉన్న కవితలను  వారు ఉదహరిస్తూ ఉంటారు.  2020 బడ్జెట్ ఉపన్యాసంలో నిర్మలా సీతారామన్ కశ్మీరీ కవితను చదివారు.

“Humara Watan khilte hue Shalimar bagh Jaise

Humara Watan Dal lake mein khilte hue kamal jaise

Nau jawanon ke grama khoon jaisa

Mera watan tera watan, humara watan

Duniya ka sabse pyara watan” అనే ఉర్దూ కవిత చదివారు. ఇది కశ్మీరీ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పండిట్ దీననాథ్  కౌల్ రాసిన పద్యం. కేంద్రం  ఆర్టికల్ 370 రద్దు చేశాక వచ్చిన బడ్జెట్ ఇది. ఇందులో షాలిమార్ బాగ్, దాల్ లేక్ ల ప్రస్తావన ఉంది. భారతదేశం నీది, నాది మనందరిది అనే సందేశం ఉంది.

“నా దేశం షాలిమార్ బాగ్ లాగా వికసిస్తూ ఉంది. నా దేశం దాల్ లేక్ లోని కమలం లాగా వికసిస్తూ ఉంది.నాదేశంలో  ఉడుకుతున్న యువ రక్తంలాగా ఉంది. ఇది నాదేశం, నీదేశం, మనందరిదేశం,ప్రపంచమంతా ప్రేమించే దేశం.”

అదే ఉపన్యాసంలో ఆమె తమిళ తత్వవేత్త, కవి తిరువళ్లువార్  సూక్తులను కూడా ఉదహరించారు. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే, అయిదు వజ్రాల్లాంటి లక్షణాలుండాలి.  అవి ఏంటంటే… “Pinhyinmai, Selvam “Vilaivinpam Emam Aniyenpa Naattiv Vaindu”  (రోగాలు ఉండరాదు,  సంపద ఉండాలి. సస్యశ్యామలంగాసుభిక్షంగా ఉండాలి. సంతోషం ఉండాలి. దేశ రక్షణకు మంచి సైన్యం ఉండాలి)

ఇక 2019 బడ్జెట్  ప్రసంగంలో  ఉర్దూ కవి మంజూర్ హస్మిని ఉదహరించారు. “Yaqin ho to koi rasta nikalta hai, hawa ki ot bhi le kar chirag jalta hai”

ఇక ఆమె తన  2019 బడ్జెట్  ప్రసంగంలో  ఉర్దూ కవి మంజూర్ హస్మిని ఉదహరించారు. “Yaqin ho to koi rasta nikalta hai, hawa ki ot bhi le kar chirag jalta hai”  

‘నీ మీద నీకు విశ్వాసమున్నపుడు కచ్చితంగా దారి కనపడుతుంది, సుడిగాలిలో ఎలాగైనా  వెలిగే దీపం లాగా,’ అని ఈ చరణం అర్థం.

మరి 2021 బడ్జెట్ కు ఆమె ఏ కవిని ఎంచుకున్నారో కొద్ది సేపట్లో తెలుస్తుంది.

2016 లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ : ఆయన నాటి ఆర్థిక పరిస్థితి  మీద ఉర్దూ కవిత చదివారు.

Kasthi chalaane wlaon ne jab haar kar di patwar haemin,

Lehar lehar toofan mile aur mauj mauj manijdhaar haemin.

Phir bhi dikhaya hai humne, aur phir yeh dikha denge sabko,

In halat mein aata hai  daria karna paar humein

(అలసిపోయిన నావికుడు పడవ తెడ్లు మాకు అప్పగించినపుడు, నది తుఫాన్తో అల్లకల్లోలంగా ఉంది. అయితే, ఆ పరిస్థితుల్లో కూడా నదిని ఎలా దాటాలో చూపెట్టాం. ఇక ముందు కూడా చూపెడతాం.)

2013 పి చిదంబరం బడ్జెట్

2013లో బడ్జెట్ ప్రవేశపెడుతూ నాటి ఆర్థిక మంత్రి పి చిదంబరం తమిళ గ్రంధం తిరుక్కురుల్ నుంచి పద్యాలను ఉదహరించారు. తిరుక్కురుల్ తమిళుల పవిత్ర గ్రంధం.ఇందులో  1330 పద కవితలున్నాయి.

“Kalangathu kanda vinaikkan thulangtathu thookkang kadinthu seyal”

(దృఢ చిత్తంతో అజ్ఞానపు నిద్రవొదిలించేలాగా కళ్లతో చూసి నిజమని నమ్మినపుడు మనిషి దాన్ని ఆచరించి తీరాలి)

1990లో మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రతిపాదిస్తున్నపుడు  అల్లామా ఇక్బాల్ కవిత ను ఉదహరించారు.

“Yunaan-o-Misr-o-Rom sab mit gaye jahaan se / Ab tak magar hai baaki, naam –o- nishaan hamara”

(రోమ్, గ్రీకు వంటి నాగరికతలు మట్టిలో కలిసిపోయాయి. కాని మన నాగరిక విలసిల్లుతూ ఉంది.)

అంతకు ముందు 2001 బడ్జెట్ లో  ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కూడా ఒక ఉర్దూ కవిత ఉదహరించారు,

“Taqaaza hai waqt kaa ke toofaan se joohho, kahaan tak chaloge kinaare kinaare”

తుఫాన్ ని ఎదిరిస్తావని కాలం నీకోసం ఎదురుచూస్తున్నది, ఎంతకాలమలా తీరాన నడుస్తూ పోతుంటావ్… అని దీనర్థం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *