2021 -22 వార్షిక బడ్జెట్ కు 10.47 ని.లకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
2021-22 వార్షిక బడ్జెట్ ఉదయం 11 గంటలకు పార్లమెంటు ముందుకు రానుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి ఆమె గన టాబ్ లో చూస్తూ బడ్జెట్ ప్రసంగం చదువుతారు ఆ తర్వాత ఒక ఒక కేంద్రమంత్రి రాజ్య సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా (Budget like no other) విశేషంగా ఉంటుందని ఆమె ప్రకటించారు.
కరోనా దేశాన్ని కుదిపి వేసి ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీశాక రకరకాల ఆశల మధ్య, ఈ బడ్జెట్ పార్లమెంటు ముందుకు వస్తున్నది. పార్లమెంటు సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలను అమోదిస్తుంది. క్యాబినెట్ ఆమోదం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీల్లేదు.
ఈ సారి రికార్డు స్థాయిలో 1.2 లక్షల కోట్ల రుపాయల జిఎస్ టి వసూలయిన ఆనందోత్సాహాల మధ్య బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.అయితే,బడ్జెట్ ప్రతిపాదనల మీద ఏ మాత్రం క్లూ లేకపోవడంతో సెన్సెక్స్ బాగా పడిపోయింది. స్టాక్ ధరలు కూడా బాగా పడిపోయాయి.
బడ్జెట్ పుస్తకాలను ఎంపిలకు గతంలో లెదర్ బ్రీఫ్ కేసులో అందించే వారు. నిర్మలా సీతారామన్ లెదర్ (తోలు) మంచిది కాదని చెప్పి బ్రీఫ్ కేసు బదులు ఎర్రటి ఫోల్డర్ ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ సిద్ధమవుతూ శుక్రవారం నాడు ఎకనమిక్ సర్వే ప్రవేశపెట్టారు. ఇందులో జిడిపి వృద్ధి లో 7.7 శాతం తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
ఈ సారి బడ్జెట్ పార్లమెంటు సభ్యులకు,దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ (Union Budget Mobile App) విడుదల చేశారు.
9. 41. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇతర అధికారులు పార్లమెంటు భవనం చేరుకున్నారు.
ఉదయం 8.45 గం. : తన నివాసం నుంచి నేరుగా పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి బయల్దేరారు. నార్త్ బ్లాక్‌లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నిర్మల భేటీ అయ్యారు. ఉదయం 9.30: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి, బడ్జెట్ మొదటి ప్రతిని అందించారు.
ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రతులతో నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు బయల్దేరుతారు.
9.11 కు అనురాగ్ ఠాకూర్ తో కలసి ఆమె ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి బడ్జెట్ టాబ్ ఉన్న ఎర్రటి లెడ్జర్ తో బయటకు వచ్చారు.
ఉదయం 10.15: పార్లమెంటులోని గేట్ నెం.1కు చేరుతారు.
ఉదయం 10.30: బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది.
ఉదయం 11.00: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఇది పేపర్ లెస్ బడ్జెట్. కోవిడ్ కారణంగా ఈ సారి బడ్జెట్ ప్రతిపాదలను పుస్తకరూపంలో ప్రింట్ చేయడం లేదు.
ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సెషన్(తొలి భాగం) ఫిబ్రవరి 13నే ముగుస్తున్నది
విరామం తర్వాత మార్చి 8- ఏప్రిల్ 8 మధ్య రెండో సెషన్ నిర్వహించనున్నారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ సమావేశాలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి.
#UnionBudget2021 to be the first-ever digital-only Budget@FinMinIndia @PIB_India @airnewsalerts pic.twitter.com/rcZGm2IH7h
— DD News (@DDNewslive) February 1, 2021