ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను స్టాక్ మార్కెట్ స్వాగతించింది. సానుకూలంగా స్పందించింది. దీనితో శుక్రవారం దాకా పతనమవుతూ వచ్చిన సెన్సెక్స్ కు రెక్చలొచ్చాయి. ఏకంగా 2000పాయింట్లు పెరిగి 48,226 చేరింది. నిఫ్టీ 462.5 పాయింట్స్ పెరిగి 14 వేల మార్క్ ను సమీపించింది. సెన్సెక్స్ కు సంబంధించి ఇండస్ ఇండ్ బ్యాక్ బాగా పెరిగింది. సుమారు 10 శాతం వృద్ధి. బడ్జెట్ ప్రతిపాదనలతో వూపందుకున్న మిగతా స్టాక్స్ లో ఐసిఐసిఐ, హెచ్ డిఎప్ సి. బజాజ్ ఫిన్ సర్వీస్, ఎం అండ్ఎం, ఎస్ బి లు ఉన్నాయి.
బడ్జట్ లో గవర్న్ మెంట్ క్యాపిటల్ ఎక్స్ పిండిచర్ 34.5శాతం పెరుగుతుందని ప్రకటించడమే దీనికి కారణం. ఈ బడ్జెట్ లో 5.5 లక్షల కోట్లు ఈపద్దు కింద చూపించారు. ఇది స్టాక్ మార్కెట్ ను ఉత్సాహపరిచింది. ఇదే విధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లను పట్టిష్టపరిచేందుకు మరొక రు. 20 వేలకోట్ల కేటాయిస్తున్నారు. కరెంట్ ఇయర్ లో కూడా రు. 20 వేలు కేటాయించారు. బ్యాంక్ లకు ఉన్న బకాయీల వ్యవహారాలు చూసేందుకు ఒక కంపెనీని ఏర్పాటు చేస్తామని బడ్జెట్ లో ప్రతిపాదించడం కూడా స్టాక్ మార్కెట్ ఉత్సాహానికి కారణమయింది.
సీనియర్ సిటిజన్లకు ఊరట
75 ఏళ్లు పైబడిన వారికి ఫైలింగ్ నుంచి మినహాయింపునివ్వడమనేదిపెద్ద ఊరట. పెన్సన్, వడ్డీ ఆదాయం మీద ఆధార పడిన వాళ్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనవసరం లేకుండా మినహాయింపునిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో కొంత క్లారిటీమిస అయింది.ఎందుకంటే, వీళ్ల కొందురు తమ సేవింగ్స్ ఈక్విటీస్ లో పెట్టి ఉంటారు. వాళ్లకి కొంత డివిడెండ్ వస్తూ ఉంటుంది. ఈ ఆదాయానికి కూడా మినహాయింపు ఉంటుందా అనే దానికి క్లారిటీ కావాలి.
ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ
ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు ఒకే చెప్పింది. ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ చేయబోతుందిజ ఇందుకు అవసరమయిన చట్టసవరణ చేస్తారు. 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు వెల్లడించారు.
మూడు సంవత్సరాల్లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లోకి మరో వంద నగరాలను చేరుస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పవర్ సెక్టార్ కోసం రూ. 3.05 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.