ఇక బంగారు ధర తగ్గుతుంది…. స్మగ్లింగ్ కు జడిసిన ఆర్థికమంత్రి

ఇంత వరకుకొనేందుకు అందుబాటులో లేకుండా పోయిన బంగారు ధరలు తగ్గు ముఖం పట్టనున్నాయి. పది గ్రాముల  బంగారు ధర  రు. 50 వేలకు అటుఇటుగా ఉండటంతో దేశంలోప్రజలు ఎంతో అవసరమయితే బంగారు కొనడం మానేశారు. దీనితో బంగారు నగల డిమాండ్ పడిపోయింది. దిగుమతులు పడిపోయాయి. స్మగ్గింగ్ విపరీతంగా పెరిగింది. రకరకాల అక్రమ మార్గాలలో ప్రజల గల్ఫ్ దేశాలనుంచి బంగారు స్మగ్లింగ్ చేస్తున్నారు. కడుపులో, పురీషనాళంలో కూడా దాచుకుని బంగారు తెస్తున్నారు. హైదరాబాద్ఎయిర్ పోర్ట్ లో కేజీలకు కేజీల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్నవార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం.

దీనికి ఒక ప్రధాన కారణం రెండేళ్ల కిందట బంగారు మీద దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి  12.5 శాతానికి పెంచడమే. వ్యాపారస్థుల నుంచి ప్రజలనుంచి  ఇంపోర్టు డ్యూటీ తగ్గించాలనే డిమాండ్ పెరిగింది. దీనికి ఆర్థిక మంత్రి తలొగ్గారు.

ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతూ  బంగారు మీద దిగుమతి సుంకాన్ని  ఇపుడున్న 12.5 శాతం నుంచి  7.5 శాతానికి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మధ్య దేశం బంగారు దిగుమతులు  చాలా దారుణంగా పడిపోయాయి. బంగారు కొనే వాళ్లు లేకుండా పోయింది. ప్రపంచంలో బంగారు దిగుమతి చేసుకుంటున్న రెండో పెద్ద దేశం ఇండియా.  మొదటిది చైనా.  2020లో  446.4 టన్నుల  బంగారు ను  రు.188,280 కోట్లు పెట్టి దిగుమతి చేసుకుంది. నిజానికి ఇది చాలా తక్కువ.  2019లో ద 690.4 టన్నుల బంగారు దిగుమతిచేసుకుంది.  అంటే దాదాపు 35 శాతం డిమాండ్ పడిపోయింది. దేశంలో నగలు, అభరణాల డిమాండ్ కూడా  42 శాతానికి పడిపోయింది  315.9 టన్నలకు చేరింది.  కోవిడ్ కు ముందు ఉన్న డిమాండ్  544.6 టన్నులు. దీనితో స్మగ్గింగ్ తీవ్రమయింది.అందులో కూడా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్మగ్లింగ్ కు కేంద్రం కావడం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

ఇపుడు ఆర్థిక మంత్రి ఇంపోర్టు డ్యూటీ తగ్గించడంతో వ్యాపారస్థులకు, కొనుగోలు దారులకు మేలుజరుగుతుంది. ఇదే సమయంలో 3 శాతం జిఎస్ టి ని కూడా పున:పరిశీలిస్తే బాగుంటుందని వ్యాపార ర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *