పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డిని బర్త్‌రఫ్ చేయాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్
చల్లా ధర్మా రెడ్డి అధికార మత్తులో వున్నవా ?
పేదోల్లు, చిన్న కులాలకు చెందిన ప్రజలంటే ఇంత చిన్న చూపా ?
చల్లా ధర్మా రెడ్డి వాఖ్యలపై సిఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి ?
చల్లా ధర్మా రెడ్డి పై కేసు నమోదు చేయాలి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. చల్లా ధర్మారెడ్డి చెంపలు పగలగొడతామని హెచ్చరించారు.
తాజాగా జరిగిన ఓసీ రాష్ట్ర మహాగర్జన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దళితులు, బీసీ కులాలు, రిజర్వేషన్లు ఉద్దేశిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులు, బీసీలు, రిజర్వేషన్లు కారణంగానే దేశం, రాష్ట్రం నాశనమౌతుందని, ఎలాంటి ప్రతిభ లేకున్నా కేవలం రిజర్వేషన్ తో ఉద్యోగాలు పొంది, సరిగ్గా పని చేయడం చేతకాక వ్యవస్థలని బ్రష్టుపట్టిస్తున్నారని చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. చల్లా ధర్మా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.
”చల్లా ధర్మా రెడ్డి అధికార మత్తులో వున్నవా ? లేదా మదమెక్కి మాట్లాడుతున్నావా ? పేదోల్లు, చిన్న కులాలకు చెందిన ప్రజలంటే ఇంత చిన్న చూపా ?పట్టుమని పది శాతం లేని మీరు అధికారం, ఆధిపత్యం చెలాయించవచ్చు. తెలివి, సమర్ధత మీ సొత్తు అయినట్లు, అణగదొక్కబడిన వర్గాలకు తెలివిలేనట్లు, సమర్ధులు కానట్లు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అగ్రవర్ణ దురహంకార గానే భావించాల్సివస్తుంది. చల్లా ధర్మా రెడ్డి అన్నం తింటున్నావా ? గట్టి తింటున్నావా ? అని అని ధ్వజమెత్తారు దాసోజు.
”చల్లా ధర్మా రెడ్డి లాంటి సన్నాసులని, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఇలాంటిసోయిలేని వాళ్ళని ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి” అన్ డిమాండ్ చేశారు శ్రవణ్. ”ఇది టీఆర్ఎస్ పార్టీ వైఖరా ? లేదా చల్లా ధర్మా రెడ్డి వైఖరా ? అని ప్రశ్నించిన శ్రవణ్… గతంలోనే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని హామే ఇచ్చిన కేసీఆర్ చివరకి దళితుల నోట్లో మట్టికొట్టారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యని ఎందుకు బర్త్ రఫ్ చేశారో ఎవరికీ తెలీదు. ఇవాళ చల్లా ధర్మా రెడ్డి లాంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అణగదొక్కబడ్డ వర్గాల ఆత్మ గౌరవంని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఇంతవరకూ కేసీఆర్ చర్యలు తీసుకోలేదు. సిఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు అణగదొక్కబడ్డ వర్గాల ఆత్మ గౌరవంపై ఏ మాత్రం నిబద్దత వున్నా చల్లా ధర్మా రెడ్డిని వంటనే పార్టీ నుండి బర్త్‌రఫ్ చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.
”రాజ్యంగం ద్వార వచ్చిన పదవుల్లో కూర్చున్న వ్యక్తులు ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం చట్టరిత్యా నేరం. చల్లా ధర్మా రెడ్డి లాంటి వ్యక్తులు ఎమ్మెల్యే గా కొనసాగడానికి అర్హులు కాదు. తెలంగాణ డిజీపీ గారిని కూడా కోరుతున్నాం. అణగదొక్కబడ్డ వర్గాల ఆత్మ గౌరవాన్ని కించపరిచిన చల్లా ధర్మా రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.
వీడియో