తెలంగాణ లో రేపటి నుంచి విద్యాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోవిడ్ నివారణ, విద్యార్థుల వసతి ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా ఆందోళ్ లోని బాలికల సాంఘిక గురుకుల జూనియర్ కళాశాల ఆయన ఉన్నట్లుండి ప్రత్యక్షమయి అందరినీ ఆశ్చర్య పరిచారు.
కళాశాల ప్రిన్సిపాల్, కేర్ టేకర్, అసిస్టెంట్ కేర్ టేకర్, వంట పని వారు ఎవరూ లేకపోవడంతో హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడిన తను తనిఖీ చేస్తున్నపుడు ఉన్న పరిస్థితిని వివరించారు. సిబ్బందికి తగిన ఆదేశాలివ్వాలని సూచన లిచ్చారు.
ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని, తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సమీక్ష నిర్వహించి చెప్పినా బాధ్యులెవరూ కళాశాలకే రాకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏర్పాట్లను పరిశీలించేందుకు వసతి గృహం వద్దకు తాము వెళ్లామని అయితే, వసతి గృహం మూసి ఉందని, తాళాలు తమ వద్ద లేవని సిబ్బంది మంత్రికి తెలియ చేశారు.
విద్యార్థులు తిరిగి వస్తున్న విషయం గుర్తు చేస్తూ ఈ రాత్రి ఎవరైనా విద్యార్థులు వస్తే వారు ఎక్కడ ఉంటారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.