50 సంవత్సరా వయస్సు దాటిన ఉద్యోగులను, దీర్ఘకాలిక వ్యాధులతో ప్రత్యేకంగా షుగర్, బీపీ, హార్ట్ పేషెంట్స్, క్యాన్సర్ తదితర ఉద్యోగులను, అధికారులను ఎన్నికల విధుల నుండి మినహాయించాలని AP JAC అమరావతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను కోరారు.
అలాగే గర్భిణీ, పాలిచ్చే తల్లులను మహిళా ఉద్యోగినులను ఎన్నికల విధులనుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
AP JAC అమరావతి చైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ వైవీ రావు నాయకత్వం లో ఉద్యోగుల ప్రతినిధి బృందం కమిషనర్ క కలసి మెమోరాండం సమర్పించింది.
ఆ మధ్య ఎన్నికలను బహష్కిరించేందుకు పిలుపునిచ్చినా, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత AP JAC అమరావతి పూర్తిగా స్ట్రాటజీ మార్చుకుని ఎన్నికలకు సహకరించాలని నిర్ణయించింది. దీని ఫలితమే ఈ రోజు వినతి పత్రం.
ఎన్నికలల విధులలో పాల్గొనే ఉద్యోగులకు ప్రధానంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ తదితర ఎన్నికలలో పాల్గొనే వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వారందరికీ ప్రాణ భయం లేకుండా మానసికంగా భరోసా కల్పించాలని వారు కోరారు.
ఇదే విధంగా 2 వ మరియు 3 వ విడత ఎన్నికల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేయాలని కూడా వారు కోరారు.
ఆనాడు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తూ మరణించిన వారికి ప్రభుత్వాలు ఇస్తానన్న 50 లక్షల భీమా ఇంతవరకు అమలు కాలేదని ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇస్తున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల ఉద్యోగులకు కొంత ఆందోళన కలిగించిందని తెలిపారు.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రారంభమైన నైపథ్యంలో SEC , రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్ణయాలు, వివిధ రాజకీయ పార్టీలు, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలోని అధికారులను, ఉద్యోగులను కొంత గందరగోళానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని వారు కమిషనర్ కు తెలిపారు.
తక్కువ సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల, తగిన శిక్షణ లేకపోవడం, తక్కువ అవగాహన, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎక్కువగా లేకపోవడం, ప్రత్యేకంగా తీవ్రమైన ఒత్తిడిలో ప్రస్తుతం ఉన్నందున, ఎన్నికల నిర్వహణలో తెలియక జరిగే చిన్న చిన్న పొరపాట్లను మన్నించాలని ఉద్యోగులు, అధికారులు మీద తీసుకుంటున్న చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ని కోరారు.
అవకాశముంటే పోలింగ్ షెడ్యూల్ టైంను ప్రస్తుతం ఉన్న 6.30AM నుండి 3.30PM వరకు పోలింగ్ జరిగిన తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు అంటే చాలా అలస్యమయ్యి, రాత్రి ఎక్కువ సమయం అవుతున్నందున Law&Order ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నందున, గతంలో వలే ఉదయం 7 గం11 నుండి 1.30PM కు పోలింగ్ జరిపే విధంగా మార్పు చేయాలని, వీలుపడని పక్షంలో సదరు కౌంటింగ్ ప్రక్రియను మరుసటి రోజు జరిపితే బాగుంటుందేమో పరిశీలించాలని కూడా వారు కోరారు.