ఐపివొలలో రిటైల్ ఇన్వెస్టర్ కు ఎక్కువ షేర్లు కేటాయించేలా చేసేందుకు నియమాలను సవరించే విషయం గురించి సెబి (SEBI)యోచిస్తున్నది.
రిటైల్ ఇన్వెస్టర్స్ సంఖ్య భారత దేశ స్టాక్ మార్కెట్ లో విపరీతంగ పెరుగుతూ ఉంది.ఒక విధంగా చెబితే వాళ్లే స్టాక్ మార్కెట్ కు గత ఏడాదా ప్రాణం పోసింది వాళ్లే. నిజానికి 2020 రిటైల్ ఇన్విస్టర్ సంఖ్య విపరీతంగా పెరిగింది.
రిటైల్ ఇన్వెస్టర్లు ఎలా పెరుగుతన్నారో దేశంలో ఓపెన్ చేస్తున్న డిమ్యాట్ అకౌంట్ల సంఖ్య చూస్తే తెలుస్తుంది.
2009 డిసెంబర్- 2019 డిసెంబర్ మధ్య సిడిఎస్ ఎల్ (CDSL), ఎన్ ఎస్ డిఎల్ (NSDL) ఓపెన్ చేసిన కొంత డిమ్యాట్ అకౌంట్లు కేవలం 2.1 కోట్లు.
దీనితో 2019 డిసెంబర్ నాటికి దేశంలో ఉన్న మొత్తం డిమ్యాట్ అకౌంట్లు 3.93 కోట్లయ్యాయి.
డిసెంబర్ 2020 నాటికి అంటే ఒక ఏడాదిలోొ దేశంలో డిమ్యాట్ అకౌంట్లు 4.98 కోట్లకు చేరాయి. డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 మధ్య 1.5 కోట్ల డిమ్యాట్ అకౌంట్లు వచ్చాయి. ఈ కాలమంతా కరోనా లాక్ డౌన్ కాలమే.
ప్రతినెలా 8 లక్షల డిమ్యాట్ అకౌంట్లు తెరిచారన్న మాట. లాక్ డౌన్ మొదలయ్యాక సగటున నెలసరి ఓపెన్ అయిన డిమ్యాట్ అకౌంట్లు10 లక్షలు.
అందుకని రిటైల్ ఇన్వెస్ట్ర్లు ఇంకా పెద్ద సంఖ్యలో వ్యాపారంలోపాల్గొనేందుకు సెబి(SEBI) చర్యలు తీసుకుంటూ ఉంది.ఐపివొ (IPO)లలో మినిమమ్ అప్లికేషన్ సైజ్ ను రు 15వేల నుంచి రు. 7,500కు తగ్గించేందుకు సెబి కంపెనీలతో చర్చలు మొదలుపెట్టింది.
మంచి ఐపివొలు విడుదలయినపుడు తమకు ఐపిఒ సబ్ స్ర్కి ప్షన్ దొరకడం లేదని చాలా రిటైల్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్స్ కు సెబికి ఫిర్యాదు చేశాయి. దీనితో మినిమమ్ అప్లికేషన్ సైజ్ ను రు. 15,000 నుంచి రు. 7,500 తగ్గించేలా సెబి కృషి మొదలుపెట్టిందని మనీకంట్రోల్ రాసింది. అప్లికేషన్ సైజు తగ్గిస్తే సబ్ స్ర్కిప్షన్ల సంఖ్య పెరుగుతుంది. అది రిటైల్ ఇన్వెస్టర్లకు బాగా ఉపయోగపడుతుంది. గత ఏడాది విజయవంతమయిన ఐపివొలల్ రిటైల్ ఇన్వెస్టర్ల వాటా చాలా ఎక్కువగా ఉంది.
150 రెట్లు వోవర్ సబ్ స్క్రైబ్ అయిన హ్యపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీ (Happiest Minds Technolgoies) IPO లోరిటైల్ ఇన్వెస్టర్ల షేర్ ఎంతో తెలుసా. 70.94 శాతం. ఇదేవిధంగా బెక్టార్స్ ఫుడ్ స్పెషాలిటీస్ (Mrs Bectors Food specialities) ఐపివొల రైటైల్ ఇన్వెస్టర్ల 68 రెట్లుంది. ఇదే పరిస్థితి మజగావ్ డాక్ (36 రెట్టు), ఐఆర్ సిటిసి (15 రెట్లు) IPO లలో రిటైల్ ఇన్వెస్టర్లవాటా గణనీయంగా ఉంది. అయితే, ఐపివొలకు వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లు బాగా తక్కువ.
ఐపివొ సెగ్ మెంట్ లో సెబి అనుకున్నంత మాత్రాన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా పెంచడం సాధ్యం కాదు. ఐపివొలకు సంబంధించి లాభాలలో ఉన్న కంపెనీలలో 35 శాతం, నష్టాలలో ఉన్న కంపెనీలలో 10 శాతం వాటాను సెబి ఖరారు చేసింది.
అయితే, మంచి ఐపివొలలో రిటైలర్లు భాగస్వాములయ్యేందుకు వీలుదొరకడం లేదు. మినిమమ్ సబ్ స్ర్కి ప్షన్ సైజును 15వేల రుపాయల నుంచి ఏడెనిమి వేలకు తగ్గిస్తే రిటైలర్లకు ప్రయోజనం ఉంటుంది. అపుడు రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ సబ్ స్ర్కిప్షన్ లను సంపాదించగలుగుతారు. దీనికోసం సెబిగైడ్ లైన్స్ మార్చాల్సి ఉంటుంది. ఇలా మార్చడం వల్ల ట్రేండిగ్ మోతాదు మీద ప్రభావమేమీ పడదు. పెద్ద ఎత్తున వస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ లో చోటు కల్పించాలంటే రూల్స్ సవరించక తప్పదు.