ఇండియన్ మార్కెట్లలో గోల్డ్ ధర తగ్గుముఖం…
ఈ శుక్రవారం గోల్డ్ కు మంచి రోజులా కనిపించడం లేదు.అమెరికాలో ఆర్థిక వాతావరణం కొద్దిగా మెరుగుపడటం డాటర్ పుంజుకోవడంతో మన దేశంలో బంగారు ట్రేడింగ్ నెగెటివ్ ప్రభావానికి లోనయింది. MCX (Multi Commodity Exchange)లో బంగారు 49వేల దిగువనే ట్రేడ్ అవుతూ ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ వార్త రాస్తున్నపటికి 0.36 శాతం ధర పడిపోయి పదిగ్రామలు ధర రు. 48,688 దగ్గిర ఉంది. ఇదే విధంగా వెండి ధర కూడ ఒక శాతం తగ్గి కిలో ధర 65,869 కి దిగింది.
అందువల్ల మళ్లీ 49వేల వైపు ధర తిరగ్గానే ఇన్వెస్టర్ గోల్ ను వదలుకునేందుకు ప్రయత్నిస్తారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించేందుకు సుముఖం వ్యక్తం చేయడంతో డాలర్ బరువెక్కింది.