ఇంట్లోనో, ఆఫీస్ కెఫెటేరియాలోనో, రైల్లో బెర్త్ మీదనో, లేదా ఏకాంతంగా ఎక్కడో మరొక చోట మొబైల్ ఫోన్ వాడుతూ ఎవ్వరు చూడకుండా లో చాట్ చేస్తున్నానని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు.
నిజం, అది కేవలం భ్రమ మాత్రమే. ప్రతిక్షణం మీరేంచేస్తున్నారో ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు. మీ ఫోన్ మీద మీకంటే అదృశ్య శక్తులకే ఎక్కువ పట్టు ఉంటుంది.
పర్సనల్ డేటా గురించి మీకంటేబయటి వాళ్లకే ఎక్కువ తెలుసు. మిమ్మల్ని ప్రతిక్షణం ఎంతోమంది ఎక్కడో కూర్చుకుని ట్రాక్ చేస్తుంటారు, కనిపెడుతూ ఉంటారు. మీకు తెలుసోలేదో,మీరు ఏదైనా రెస్టరాంట్ కు వెళ్లినా, సినిమాకు వెళ్లినా, సరదాగా ఎవరో మిత్రుడి ఇంటికి వెళ్లినా, షాపింగ్ మాల్ కు వెళ్లినా, పార్క్ కు వెళ్లినా గూగుల్ కనిపెడుతుంది. అంతేకాదు, ప్రతినెలా నువ్వుడెక్కడ తిరిగావో నేను చూశాలే అని ‘ఇది గో లిస్టు’ అని జాబితా పంపిస్తుంది.
మీరు మెయిల్ ఓపెన్ చేసినా, చాట్ చేసినా, ఎదైనా బిల్ చెల్లించినా, మోర్ కు వెళ్లి సామాన్లు కొన్నా, మీరు గూగుల్ లో ఏదో వస్తువను సెర్చ్ చేసినా ఎవరో ఒకరు దీనిని పసిగడుతూనే ఉంటారు. మీరు ప్రతిక్షణం ఎవరో ఒకరి నిఘాలో ఉంటున్నారని మర్చిపోవద్దండి.
మీ డేటా ఎపుడూ ఎవరో ఒకరికి నిశబ్దంగా చేరుతూ ఉంటుంది. అయితే, వక్తులుగా దీని పర్యవసానాలు మీకు చాలా సందర్భాలలో పెద్దగా ఉండవు. అపుడపుడూ పాప్ అప్ యాడ్స్ వస్తుండొచ్చు, మెయిల్స్ వస్తుండొచ్చు. ఉంటే మాత్రమే కొంపమునుగుంది. చాలా సందర్బాలలో మన డేటా చౌర్యమవుతున్నా మనం ఏమీ చేయాలని నిస్సహాయతలో ఉంటాం. ఇలా సైబర్ క్రైమ్ లలో కోట్ల రుపాయలు అమయాకులు కోల్పోతుంటారు. పేపర్ తిరగేయండి, రోజూ మీకు ఎదో సైబర్ క్రైమ్ మోసం వార్త కనిపిస్తూనే ఉంటుంది.
అందుకే ప్రతిపౌరుడికి తన డేటా గురించిన స్పృహ కలిగించేందుకు చాలా దేశాలలో డేటా ప్రొటక్షన్ డే (Data Protection Day) అని జరుపుతారు. ప్రతి యేటా, అమెరికాలో, కెనాడాలో యూరోప్ లోని అనేక దేశాలలో జనవరి 28ని డేటా ప్రొటెక్షన్ డే గా జరుపుతారు. జనవరి 28ని డేటా ప్రొటెక్షన్ డే గా జరపాలని 2006 ఏప్రిల్ 26 నే కౌన్సిల్ ఆఫ్ యూరోప్ (Council of Europe) నిర్ణయించింది. తదుపతి జనవరి 28న యూరోప్ కౌన్సిల్ కన్వెన్షన్ 108 (Convention 108)ని ప్రారంభించింది. దీనికి అంగీకరించే వాళ్లెవరైనా దీని మీద సంతకాలు చేయవచ్చు. యూరోప్ బయట ఈ రోజుని ఫ్రైవసీ డే (Privacy Day)అని పిలుస్తారు.
పౌరులలో డైటా ప్రొటెక్షన్ స్పృహపెంచేందుకు ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాలు, సంస్థలు అనేక కార్యక్రమాలు చేపడతాయి. ఇపుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి దీనిని కూడా ఈ కన్వెన్షన్ పరిధిలోకి తెచ్చేందుకు కన్వెన్షన్ 108+(Convention 108+) 2018 జనవరి 28 ప్రారంభించారు.
భారతదేశంలో డేటా ప్రొటెక్షన్ కోసం ఇపుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీకి కేంద్రం వ్యతిరేకత చెప్పడం ఇందులో భాగమే. కేంద్ర ప్రభుత్వం తొందర్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ (PDPB) తీసుకు రాబోతున్నది. ఇపుడు ఈ బిల్లు పార్లమెంటు జాయింట్ సెలెక్ట్ కమిటీ ను పరిశీలిస్తున్నది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ కోసం డేటా ప్రొటెక్షన్ అథారిటీ (Data Protection Authority of India) ఏర్పాటు చేయాలన్నప్రతిపాదన బిల్లులో ఉంది. తమకు చేరిన పర్సనల్ డేటాను కంపెనీలు దుర్వినియోగం చేయకుండా ఈ బిల్లులో ఏర్పాట్లున్నాయి. అయితే, మీ మొబైల్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్ హ్యాక్ కాకుండా జాగ్రత్త తీసుకోవడం మీ బాధ్యత.
డేటా ప్రొటెక్షన్ చర్యలు
ఇపుడు చాలా వరకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని మొబైల్ మీదే సాగుతుంటాయి. ఈ సమయంలో కంపెనీలు, వ్యక్తులు కూడా కట్టుదిట్టమయిన భద్రతా చర్యలు తీసుకోవాలి. మొబైల్ నుంచే చాలా కీలకమయిన విషయాలను షేర్ చేస్తుంటారు కాబట్టి, వీటిని రాబట్టేందుకు సైబర్ నేరస్థులు రకరకాల పద్దతులను ఉపయోగిస్తారు. సోషల్ఇంజనీరింగ్ ఇందులో ఒకటి. ఈ నేరగాళ్లు బ్యాంకు ప్రతినిధి అనో, కంపెనీ ప్రతినిధి అనో మీకు ఫోన్ చేసి నమ్మించి, మీ అకౌంట్ల పిన్ నెంబర్లు తీసుకోవడం, లేదా మాయమాటలు చెప్పి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయంచుకోవడమో చేస్తుంటారు. అందువల్ల మీ మొబైల్ లో ఉన్న యాప్స్ మీరు రాసే వన్ టైం పాస్ వర్డ్ (OTP) రీడ్ చేయకుండా చేయాలి. దీనికి ఒకటే మార్గం. మీకు SMS ద్వారా వచ్చే ఒటిపి ని కాపి చేసి పేస్టు చేయకుండా మాన్యువల్ గా టైప్ చేయాలి.
మరొక మార్గం, కొన్ని అనవసరమయిన పనులకు అంటే ట్రాన్సాక్షన్స్ కు కార్డు వాడకుండా బ్లాక్ చేయవచ్చు. రిజర్వు బ్యాంకు ఈ ఏర్పాటు కల్పించింది. ఉదాహరణకు మీరు విదేశాలకు వెళ్లనపుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ను లాక్ చేసుకోవచ్చు. పాస్ వర్డ్స్ స్ట్రాంగ్ గా ఉండేలా చూడండి. పాప్ వర్డ్ కంటే బయోమెట్రిక్ ఆధెంటికేషన్ ఉంటే మరి మంచింది.
సోషల్ నెట్ వర్క్ లో ఉన్నపుడు పర్సనల్ డేటా షేర్ చేయకుండా ఉండాలి.
మీ ఫోన్ అసాధారణంగా స్లో అయితే అనుమానించాల్సిందే నని నిపుణులు చెబుతున్నారు. అంటే ఏదైనా మాల్ వేర్ చొరబడి మీ డేటాను కాజేస్తున్నపుడు ఫోన్ చాలా స్లో అవుతుంది.
ఫోన్ బ్యాటరీ చాలా తొందరగా ఖర్చవుతుంటేకూడా ఫోన్ హ్యాక్ అయినట్లుగా అనుమానించాలి. మీ ఫోన్ లోకి విపరీతంగా పాప్ అప్ అడ్వర్టయిమెంట్స్ వస్తున్నా అనుమానించాల్సిందే. ఇది కూడా ఒక విధమయిన మాల్ వేరే. ఇది మీరు కొన్ని పేజీలను కచ్చితంగా చూసేలాగా చేసి వాళ్లకి బాగా రెవిన్యూ వచ్చే లా ఈ మాల్ వేర్స్ చేస్తాయి.
ఎవరికీ అర్థంకాని భాషలో లేదా గజిబిజిగా మేసేజెస్ వచ్చినా ఫోన్ లో కి ఏదో మాల్ వేర్ చొరబడిందనేందుకు ఒక సిగ్నల్ అని నిపుణులు చెబుతున్నారు.