తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియమించిన తొలి పిఆర్ సిలో తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల కడుపు కొట్టిందని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి అంటున్నారు. పిఆర్ ఎసి నివేదికలో ఏమి ఉందో ఏమి లేదో ఆయన వివరిస్తున్నారు. తెలంగాణ వస్తే బతుకులు ఆమాంతం బాగు పడ్తాయని ఆశించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఊహించని ఈ నివేదిక నిరాశ తెచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. నివేదిక ఎందుకు నిరాశపరిించిందో ఆయన వివరిస్తున్నారు.