వైరలవుతున్న నేతాజీ ICS రాజీనామా ఫేక్ లేఖ

ఈ పోటోలో ఉన్నది ‘నేతాజీ’  సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్   (ఐసిఎస్) ఉద్యోగానికి రాజీనామా చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించిన లేఖ. గత వారం రోజులుగా ఈ లేఖ  సోషల్ మీడియాలో తెగ వైరలవుతూ ఉంది.

సుభాష్ చంద్రబోస్ దస్తూరి ఎంత అందంగా ఉందో ఈ లేఖ చూస్తే అర్థమవుతుంది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష రాసి ఐసిఎస్ కు  బోస్ ఒపెన్ కాంపిటీష్ లో సెలెక్టయ్యాడు. సుభాష్ చంద్రబోస్ చదువులో దిట్ట. పాఠశాల రోజుల నుంచే ప్రతిభను చూపిస్తూ వచ్చాడు. 1920 లో సివిల్ సర్వీస్ పాసయ్యాడు. ప్రొబేషనరీ గా ఉన్నాడు. ప్రభుత్వం ఆయనకు 100పౌండ్ల అలవెన్స్ కూడా ఇచ్చింది.

ఐసిఎస్ కు రాజీనామా చేస్తూ రాసినట్టు చెబుతున్న ఫైక్ వైరల్ లేఖ

అయితే, ఆయన ఐసిఎస్  ప్రొబేషనరీగా ఉన్నపుడే  భారత స్వాతంత్య్ర ప్రోరాటం వైపు ఆకర్షితుయ్యాడు. ఇక ఆ ఉద్యోగం చేయలేమనే నిర్ణయానికి వచ్చాడు. తక్షణ కర్తవ్యం భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం  అని అనుకున్నాడు. సివిల్ సర్వీసెస్ కు రాజీనామ చేస్తూ ఈ లేఖ (పైది) రాశాడు. సుభాష్ చంద్ర బోస్ 1918లో బిఎ (ఫిలాసపీ)  అగ్రశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

సరే ఈ లేఖ విషయానికి వద్దాం. ఇది సుభాష్ రాసినట్లు చెబుతున్న ఒరిజినల్ లేఖ కాదు . భాగ పాతబడినట్లు కనిపిస్తుంది కాబట్టి నమ్మాలనిపిస్తుంది. కాని లేఖ పాతది కాదు. లేఖలో మ్యాటర్ మాత్రమే పాతది. అందులో అక్షరాలు కూడా ఆయన దస్తూరికాదు. ఆయన ఒరిజినల్ లేఖ లోని మ్యాటర్ ని కాపీ చేసి ఈ లేఖను సృష్టించారు. ఇదిగో ఒరిజినల్ లేఖ.

 

నేతాజీ సొంత దస్తూరితో రాసిన ఒరిజినల్ లేఖ

 

లేఖ రాసిన మ్యాటర్ ఇదే…

16, Herbert Street,

Cambridge

22,4,’21

Mr  Right Hon. E S NconliqueMP

Secretary of State of India

Sir,

I desire to have my removed from the list of probationers in the Indian Civil Services.  I may state in this connection that I was selected as a result of an open competitive examination held in August 1920. I have received an allowance of    £ 100 (one hundred pounds only) up till now. I shall send the amount to the India Office as soon as my resignation is accepted.

I have the honors to be sir

Your most obedient servant

Subhas Chandra Bose

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *