ఈ నెల 23న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డెంటల్ వైద్యురాలు డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్యం పరిస్థితి క్షీణించడంతో అత్యవసర వైద్యం అందించడం కోసం చెన్నై అపోలో హాస్పిటల్ కి తరలించారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆమెకు జనవరి 24న మైల్డ్ జ్వరం వచ్చింది. తర్వాత హై ఫీవర్ రావడంతో చికిత్స కోసం 26న జాయినయ్యారు. ఆమెకు సత్వరమే మెరుగైన వైద్యం అందించడం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. డాక్టర్ ధనలక్ష్మికిడ్నీ వ్యాధితో చాలా కాలం నుండి బాధ పడుతున్నట్టు మెడికల్ రిపోర్ట్ లో ఉందని ప్రకాశం జిల్లా DM&HO డాక్టర్ రత్నా వళి మంత్రి ఆళ్ల నానికి ఫోన్ లో వివరాలు వెల్లడించారు. డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఈ రోజు ఆరా తీసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రత్నా వళి, ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాములకు సూచనలిచ్చారు.
డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్యం మెరుగు పడడం కోసం ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ వల్ల అనారోగ్యం సమస్యలు వస్తున్నట్టు పుకార్లు ఎవరు నమ్మవద్దుని, ప్రజలు ఎవరు భయందోళన చెoద వద్దు అని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు.