తెలంగాణ రాష్ట్ర సర్కార్ మూడు లక్షల కోట్ల అప్పులు చేసి మెగా కృష్ణారెడ్డికి ధారపోసిందని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మేఘా కృష్ణారెడ్డికి రు 30 వేల కోట్ల సంపద ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు
మారుతీ కారులో తిరిగిన మెగా కృష్ణా రెడ్డికి 6 ఏళ్ల లో అంత డబ్బు ఎలా వచ్చింది, దీనికి మంత్రి కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పగలరా? కాళేశ్వరం, మిషన్ భగీరథ లనుంచే కృష్ణా రెడ్డి కి ఈ సంపద నంతా దోచిపెట్టారని జగ్గారెడ్డి విమర్శించారు.
జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందిస్తూ జగదీశ్ రెడ్డి ‘కరెంట్ మినిస్టరే అయినా బాడీలో కరెంట్’ లేదని అన్నారు.
‘జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ కు విస్కీలో సోడా కలిపే వాడు. మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై కామెంట్స్ చేసే అర్హత నీకెక్కడుంది? జగదీష్ రెడ్డీ, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక నీ బండారం బయటపెడతాం, కొద్ది రోజులు ఓపిక పట్టు,’ అని సలహా ఇచ్చారు.
‘తాగిన తర్వాత ఎక్కడ సంతకం పెడతావో నీకే తెలీదు. కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నావ్.. అసలు కేసీఆర్ అవినీతి ఎంత వుందో నీకు తెలీదా. నెహ్రూపై సిబిఐ ఎంక్వయిరీ వేసే దమ్ముందా. నెహ్రు గురించి మాట్లాడే అర్హత జగదీశ్వర్ రెడ్డి కి లేదు. క్యారెక్టర్ లేని జగదీశ్ సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. మాజీ ప్రధాని ఐన నెహ్రు తన ఆస్తులను దేశం కోసం ఖర్చు చేశారు. ఆయన గురించి నువ్వేమ్ మాట్లాడతావ్. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నపుడు హరీష్ రావ్ ఐదారు వేల కోట్లు వెనకేసుకున్నాడు. ఆ బ్లాక్ మనీ తో కేసీఆర్ సర్కార్ ను పడేసే ప్రయత్నం చేశాడు,’ అని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వచ్చాకా విస్కీలో సోడా కలిపే వాళ్లకు మంత్రి పదవులొచ్చాయి. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు పని చేసిందేమో అని తనకు అనిపిస్తూ ఉందని అంటూ తొందర్లో జగదీశ్వర్ రెడ్డి డాటా అంత బయట పెడ్తానని జగ్గారెడ్డి అన్నారు.
‘ పాస్ పోర్ట్ దందాలో తెలంగాణ కు కేసీఆరే గురువు. నాగార్జున సాగర్ నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మేం దేని కైనా సిద్ధం. టీఆరెస్ పాలనలో ఐఏఎస్ లు , ఐపీఎస్ లు, అధికారులు, ఉద్యోగ సంఘాలు డమ్మీ ఐపోయారు,’ అని జగ్గారెడ్డి అన్నారు.