ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిది. ఫిబ్రవరి 1న జరగాల్సిన ఆయన అనంతపురం జిల్లా కదిరి పర్యటన రద్దు అయింది. ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అట్టహాసంగా కదిరి నుండే ప్రారంభించాల్సి ఉంది.
అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు తీర్పుు ఇచ్చాక పంచాయతీ ఎన్నికల కోడ్ ను కచ్చితంగా పాటించాల్సి వస్తున్నది. నిజానికి కోడ్ అమలులోకి వచ్చి వారం రోజులువుతున్నా ప్రభుత్వం ఖాతీరుచేయలేదు.
సుప్రీం తీర్పు తర్వాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలనిప్రభుత్వం నిర్ణయించింది. దీనితో ఎన్నికలకోడ్ పాటించడం తప్పని సరి అయింది. అందువల్ల సీఎం పర్యటన రద్దు అయింది. కదిరి నియోజకవర్గ ప్రజలు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని గమనించాలని వైసిపి ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.